White Hair Turn Black:తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన ఆకు…అసలు మిస్ కావద్దు
White Hair Turn Black:తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన ఆకు…అసలు మిస్ కావద్దు.. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా యుక్త వయస్సులోనే తెల్లజుట్టు వచ్చేస్తోంది దాంతో చాలా బాధపడుతున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటాక మాత్రమే జుట్టు తెల్లగా మారేది. కానీ ప్రస్తుతం మారిన జీవన శైలి పరిస్థితుల కారణంగా చాలా తక్కువ వయసులోనే అంటే 30 ఏళ్లకే జుట్టు తెల్లగా మారిపోతుంది.
దాంతో మానసికంగా కృంగిపోయి రంగులు వేయడం స్టార్ట్ చేసేస్తున్నారు.రంగులు అనేవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలే సమస్య కూడా పెరిగిపోతుంది. అదే సహజసిద్ధమైన చిట్కాలు ఫాలో అయితే తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది దీని కోసం గుంటకలగర ఆకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది పల్లెటూర్లలో ఎక్కడపడితే అక్కడ ఉంటుంది.
మార్కెట్లో కూడా లభ్యమవుతుంది. గుంటకలగర ఆకులో ఉండే లక్షణాలు జుట్టును నల్లగా మార్చుతాయి. కొన్ని గుంటకలగర ఆకులను తీసుకొని బాగా ఎండబెట్టి పొడి తయారు చేసుకోవాలి. ఈ పొడిని నువ్వులనూనె లో వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి గంటయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తుంటే మంచి ఫలితం వస్తుంది. గుంటకలగర ఆకు పొడి రూపంలో మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెష్ గా ఉన్న ఆకు దొరికిన సరే లేదా మార్కెట్లో దొరికే పొడిని ఆయన ఉపయోగించవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.