Bachali Kura:బచ్చలికూర నిజంగా బంగారమే.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు..!
Bachali Kura:బచ్చలికూర నిజంగా బంగారమే.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు.. బచ్చలిని ఇండియన్ స్పినాచ్ లేదా మలబార్ స్పినాచ్ అని పిలుస్తారు. ఈ పంట భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో సాగవుతోంది. బచ్చలికూర సాధారణంగా తీగలాగా పెరిగే బహువార్షిక పంట. దీన్ని ఏకవార్షిక పంటగాకూడా పండిస్తారు.
దీని కాండం మోత్తగా ఉండి లోత ఆకులు కలిగి ఉంటుంది. దీని లేత కొమ్మలు, ఆకులు కాడలతో సహా కూరగాయగా వాడతారు. ఆకుకూరల్లో బచ్చలి కూరకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది తెలీని వాళ్లు అంటూ ఉండరు. దీనిలో పోషకాలతో పాటు అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. బచ్చలిలో రెండు రకాలు ఉన్నాయి. తీగబచ్చలి, కాడబచ్చలి. ఎక్కువగా కాడబచ్చలి మనకి దొరుకుతుంది.
బచ్చలికూరలో అధిక మోతాదులో కాల్సియం, పొటాషియం, మెగ్నిషియం, ఇనుము,విటమిన్ ఎ, విటమిన్ సి లను కలిగి ఉంటుంది. లేత కాడలలో కూడా విటమిన్ – ఎ ఎక్కువగా ఉంటుంది.బచ్చలి ఆకులలో (బాసిల్లరుబ్ర) ఉండే బీటాకెరాటిన్ కంటి చూపును మెరుగు పరుస్తుంది.
బచ్చలిలోని ఆక్సాలిక్ ఆసిడ్స్ మిగతా ఆకుకూరల కంటే తక్కువ మోతాదులో ఉండడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కిడ్నీలకు ఎలాంటి హాని కలగదు.ఊపిరి తిత్తులకు బచ్చలి ఎంతో మేలు చేస్తుంది. అంతే కాకుండా వృద్దాప్య ప్రక్రియను తగ్గిస్తుంది.ఆకులలోని జిగట పదార్థం మల మద్దకపు నివారణలో తోడ్పడుతుంది.
సాఫోనిన్ అనే పదార్థం బచ్చలిలో ఉండడం వలన క్యాన్సర్ రాకుండా చేస్తుంది.ఆకులు, కాండం నుండి తీసిన రసం తరచుగా వచ్చే తలనొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బచ్చలి కూర శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి కాండం మంచి కొవ్వును పెంచుతుంది.
దీనిలో సెలీనియం, నియాసిన్ , ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండటం వల్ల మెదడు, నరాల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రతి రోజూ రెగ్యులర్ గా బర్తడే ఆకును ఆహారంలో భాగంగా చేసుకుంటే చర్మం మృదువుగా ఆరోగ్యంగా మారుతుంది.
బచ్చలి కూర బరువు తగ్గడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. బచ్చలి కూర కషాయాన్ని తీసుకుంటే మూత్ర సంబంధ సమస్యలు తొలగిపోతాయి. పుండ్లు గాయాలపై బచ్చలి కూర ఆకు రసాన్ని రాస్తే తొందరగా నయం అవ్వడమే కాకుండా మంచి ఉపశమనం కలుగుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా తినవచ్చు. పచ్చ కామెర్లు వచ్చి తగ్గాక బచ్చలి ఆకు ను ఆహారంలో భాగంగా చేసుకుంటే తొందరగా కోలుకుంటారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.