Kitchenvantalu

Macaroni Masala Recipe:మసాలా మాకరోనీ .. దీని రుచి అమోఘం.. తింటే అసలు వదిలిపెట్టరు

Macaroni Masala Recipe:మసాలా మాకరోనీ.. దీని రుచి అమోఘం.. తింటే అసలు వదిలిపెట్టరు.. మాకరోనీ అనేది అనేక రకాలైన పాస్తా వంటకాల తయారీకి ఉపయోగిస్తారు.

కావలసిన పదార్దాలు :
మెకరొని: కప్పు
ఉల్లిపాయలు: మూడు
నూనె: మూడు టేబుల్‌స్పూన్లు
టొమాటోగుజ్జు: అరకప్పు
కారం: టీస్పూను
పసుపు: పావుటీస్పూను
అల్లంవెల్లుల్లిముద్ద: అరటీస్పూను
జీడిపప్పు: 10
గసాలు: 2 టేబుల్‌స్పూన్లు
పెరుగు: అరకప్పు
కసూతిమెంతిపొడి: అరటీస్పూను
ఉప్పు: తగినంత
గరంమసాలా: అరటీస్పూను.

తయారి విదానం :
మెకరొనిని వేడినీటిలో వేసి ఉడికించి వార్చాలి. అందులో కొద్దిగా నూనె వేసి కలిపి పక్కన ఉంచాలి. ఉల్లిపాయను తరిగి ముద్దలా నూరాలి. గసాలు, జీడిపప్పు ముద్దగా నూరి ఉంచాలి. ఓ బాణలిలో ఉల్లిముద్దను వేసి బాగా వేయించాలి.

తరవాత అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, కారం వేయాలి. ఇప్పుడు టొమాటోగుజ్జును కొంచెంకొంచెంగా వేస్తూ వేయించాలి. తరవాత పెరుగు, జీడిపప్పుముద్ద వేసి బాగా వేయించాలి. అవసరమైతే కాసిని నీళ్లు పోసి బాగా ఉడికించాలి.

తరవాత అందులో మెకరొని వేసి 5 నిమిషాలు ఉడికించి మెంతిపొడి, గరంమసాలా చల్లి దించాలి. దీన్ని వేడివేడిగా చపాతీలోకి తింటే బాగుంటుంది.