Dandruff:ఎప్పటి నుండో వేధించే చుండ్రును ఖర్చు లేకుండా తరిమికొట్టే సింపుల్ టెక్నిక్
Dandruff:ఎప్పటి నుండో వేధించే చుండ్రును ఖర్చు లేకుండా తరిమికొట్టే సింపుల్ టెక్నిక్.. చుండ్రు వచ్చిందంటే అంత తొందరగా వదలదు. చుండ్రు సమస్య రాగానే మనలో చాలా మంది మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వైపు అడుగులు వేస్తారు. అయితే వాటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.
వేప,నిమ్మ రెండూ కూడా చుండ్రు సమస్యను తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీ బాక్టీరియా , యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి. కొన్ని వేప ఆకులను తీసుకోని శుభ్రం కడిగి నీటిలో ఉడికించి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో నిమ్మరసం కలిపి జుట్టుకి పట్టించాలి.
ఒక గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తొలగిపోతుంది. ఈ విధంగా చేయటం వలన పేల సమస్య కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ చిట్కాను ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.