Skin Care Tips: ముఖం తెల్లగా మెరవాలంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..!
Skin Care Tips: ముఖం తెల్లగా మెరవాలంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.. అందంగా కనిపించాలనిప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే, దీని కోసం వేలు ఖర్చుపెట్టి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే..సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి కొన్ని చిట్కాల ద్వారా అందంగా మారొచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
టమోటా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. ముఖం మీద నల్లని మచ్చలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. టమోటాను ముక్కలుగా కోసి ఉడికించి మెత్తని పేస్ట్ గా చేసి ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి.
చర్మంపై తేనే రాయటం వలన చర్మం పైన ఉండే మచ్చలకు, మొటిమలకు మంచి ఔషదంగా పనిచేస్తుంది. తేనెలో ‘యాంటీ-బ్యాక్టీరియా’ గుణాలు ఉన్నాయి. చర్మంను సున్నితంగా,మృదువుగా మారుస్తుంది. మచ్చల నివారణకు తేనే చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
ఒక బౌల్లో ఒక స్పూన్ బొప్పాయి పండు గుజ్జు తీసుకోవాలి. ఇందులో అరస్పూన్ ముల్తానీ మట్టిని కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఈ ప్యాక్ ఆరుతున్నట్లుగా అనిపించినప్పుడు కొన్ని నీళ్లు చల్లుకుని మర్దనా చేస్తూ ప్యాక్‌ని తొలగించాలి. ముల్తానీ మట్టికి బదులుగా శనగపిండిని కూడా వాడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.