Gutti Vankaya Gravy curry:గుత్తి వంకాయ కూరని ఓసారి ఇలా చేసి చూడండి… చాలా రుచిగా గ్రేవీ గా సూపర్ ఉంటుంది
Gutti Vankaya Gravy curry Recipe: వంకాయతో ఎన్ని వెరైటీస్ చేసినా, గుత్తి వంకాయ మసాలా కర్రీ, తింటే, ఆ మజాయే వేరు. కేవలం ఫంక్షన్స్ లోనే స్పెషల్ గా కాదు, ఇంట్లో కూడా ఈజీగా వంకాయ మలై కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
వంకాయలు – 6
పెపర్ పౌడర్ – ½ టీ స్పూన్
బటర్ – 1 టేబుల్ స్పూన్
మిల్క్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయలు – ఒక కప్పు
ఉప్పు – తగినంత
కొత్తిమీర – కొద్దిగా
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
నూనె – 2 టేబుల్ స్పూన్స్
బిర్యాని – ఆకు
యాలకులు – 4
లవంగాలు – 4
దాల్చిన చెక్క – 2 ఇంచులు
జీలకర్ర – ½ టీ స్పూన్
కారం – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు – 15
మస్క్ మెలాన్ విత్తనాలు – 2 టీ స్పూన్స్
పచ్చిమిర్చి -5
తయారీ విధానం
1.వంకాయలను ముందుగా శుభ్రంగా కడిగి, నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.కట్ చేసుకున్న ముక్కలను నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం, పల్లీలు, జీడి పప్పులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నిటిని, ఒక మిక్సీ జార్ లో వేసుకుని, మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని, నెయ్యి ,నూనె వేసుకోవాలి.
5. వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర, బిర్యాని ఆకు, వేసుకుని, అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి.
6. ఇఫ్పుడు అందులోకి ఉప్పు ,కారం, జలకర్ర పొడి యాడ్ చేసి నూనెలో కలిసేలా కలుపుకోవాలి
7. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి, నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
8. తర్వాత అందులోకి వంకాయలు వేసి బాగా కలుపుకోవాలి.
9. ఇప్పుడు గ్రేవీకి నీళ్లు పోసి , మూత పెట్టి, మీడియం ఫ్లేమ్ పై, ఆయిల్ పైకి తేలే వరకు, ఉడికించాలి.
10.చివరగా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు, అందులోకి, పెప్పర్ పౌడర్,బటర్, మరియు మిల్క్ క్రీమ్ వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయండి.
11. అంతే ఎంతో రుచికరమైన వంకాయ మలై కర్రీ రెడీ అయిపోయినట్లే..
Click Here To Follow Chaipakodi On Google News