Protein rich vada:వారంలో 2 సార్లు ఈ వడలను తింటే డయాబెటిస్,అధిక బరువు అనేవి ఉండవు
Protein rich vada:వారంలో 2 సార్లు ఈ వడలను తింటే డయాబెటిస్,అధిక బరువు అనేవి ఉండవు.. మనలో చాలామంది మినప్పప్పు వడలు, సెనగపప్పు వడలు వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మొలకెత్తిన శనగలతో వడలు చేసుకుంటే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ లభ్యమవుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి., అధిక బరువు ఉన్నవారికి, చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. .
మొలకెత్తిన శనగలలో ప్రోటీన్ చాలా ఎక్కువగాను కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగాను ఉంటుంది. అలాగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలోకి స్లోగా వెళ్లి గ్లూకోస్ ను చాలా స్లోగా విడుదల చేస్తుంది. ఈ వడను తినడం వలన రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ వడలను నూనె లేకుండా నాన్ స్టిక్ పాన్ మీద లేదా ఓవెన్ లో కానీ తయారు చేసుకోవచ్చు.
ఈ వడలను ఎలా తయారు చేయాలో చూద్దాం. మిక్సీ జార్ లో ఒక కప్పు మొలకెత్తిన శనగలు వేసి మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల పెరుగు వేసి మరోసారి మిక్సీ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలోకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి.
ఆ తర్వాత పావు కప్పు క్యారెట్ తురుము, పావు కప్పు పాలకూర తురుము, పావు కప్పు కొబ్బరి తురుము, కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ నిమ్మరసం, సరిపడా చాట్ మసాలా, ఒక స్పూన్ మీగడ వేసి అన్ని బాగా కలిసేలాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా తయారు చేసుకుని వడల మాదిరిగా వత్తి పక్కన పెట్టుకోవాలి.
ఇక ఇప్పుడు పొయ్యి వెలిగించి నాన్ స్టిక్ పాన్ తీసుకుని పొయ్యి మీద పెట్టి కొంచెం మీగడ రాసి తయారు చేసి పెట్టుకున్న వడలను వేసి రెండు వైపులా కాల్చాలి. ఈ వడలు బాగా కాలడానికి దాదాపుగా 15 నిమిషాలు సమయం పడుతుంది. ఈ వడలను .పొయ్యి సిమ్ లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి.
ఈ వడలు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. ఈ వడలను వారంలో రెండుసార్లు చేసుకుంటే డయాబెటిస్, అధిక బరువు, రక్తంలో చెడు కొలెస్ట్రాల్…ఇలా అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటాం.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.