Hair Care Tips:కొబ్బరి నూనెలో కలిపి రాస్తే చాలా తక్కువ సమయంలో జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది
Hair Care Tips:కొబ్బరి నూనెలో కలిపి రాస్తే చాలా తక్కువ సమయంలో జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.. మనలో చాలా మంది జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలని కోరుకుంటారు. జుట్టు పొడవుగా ఉంటేనే ముఖానికి అందం. జుట్టు రాలకుండా ఉండటానికి చాలా తక్కువ ఖర్చులో చాలా తక్కువ సమయంలో ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ చిట్కా చేయటం చాలా సులువు.
ఒక బౌల్ లో మూడు స్పూన్ల ఉల్లిపాయ రసం, రెండు స్పూన్ల కొబ్బరి నూనె,ఒక స్పూన్ ఆలోవెరా జెల్ వేసి బాగా కలిపి మాడుకి, జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.
తలలో రక్తప్రసరణ పెరిగి జుట్టు అవసరమైన పోషకాలు అందుతాయి. దాంతో జుట్టు కుదుళ్లు ఉత్తేజితం అయ్యి జుట్టు రాలకుండా ఉంటుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు ఫోలికల్స్‌ని ఉత్తేజపరుస్తుంది. దాంతో జుట్టు రాలకుండా పెరుగుతుంది. ఉల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ పారాసిటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన స్కాల్ప్‌పై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
దాంతో తల మీద చర్మం పొడిగా లేకుండా తేమగా ఉంటుంది. అలాగే కొబ్బరి నూనె,ఆలోవెరా కూడా జుట్టు సంరక్షణలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఈ రెమిడీని నెల రోజుల పాటు పాటిస్తే వచ్చే తేడాను చూసి చాలా ఆశ్చర్య పోతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.