Herbal Tea :రాత్రి పడుకునే ముందు ఈ టీ తాగితే ఊహించని ఎన్నో ప్రయోజనాలు…
Herbal Tea :రాత్రి పడుకునే ముందు ఈ టీ తాగితే ఊహించని ఎన్నో ప్రయోజనాలు… ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగితే రోజంతా హుషారుగా ఉత్సాహంగా ఉంటారు. అదే టీ తాగకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. అంతలా మన జీవితాలలో టీ ఒక భాగం అయిపోయింది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఇప్పుడు చెప్పే హెర్బల్ టీ తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
అధిక బరువు, కీళ్ల నొప్పులు, నిద్రలేమి వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. కాస్త ఓపికగా ఈ టీ తయారు చేసుకుని తాగండి. మిక్సీ జార్ లో అంగుళం దాల్చిన చెక్క ముక్క, మూడు యాలకులు, ఐదు మిరియాలు వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని ఎక్కువగా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసున్నర నీటిని పోసి. నీరు కాస్త వేడి అయ్యాక పైన తయారు చేసుకున్న పొడి వేయాలి. ఆ తర్వాత అర స్పూను అశ్వగంధ పొడి, పావు స్పూను శొంటి పొడి వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.
రాత్రి పడుకోవడానికి గంట ముందు ఈ టీ ని తాగితే జీర్ణ ప్రక్రియ బాగా జరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. క్యాలరీలు ఎక్కువగా కరిగి అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు. అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్ర పట్టేలా చేస్తుంది.
శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే జీర్ణ సంబంద సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ Tea ని తాగటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.