Kitchenvantalu

Miriyala Pulihora:మనం మరిచిపోయిన వెనుకటి తరం మిరియాల పులిహోర

Miriyala Pulihora:మనం మరిచిపోయిన వెనుకటి తరం మిరియాల పులిహోర.. మిర్యాల ఘాటు గొంతుకే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మిర్యాలతో పులిహోర ఎప్పుడైనా ట్రై చేసారా.లేదంటే ఇప్పుడు చేయండి.

కావాల్సిన పదార్ధాలు
అన్నం వండుకోవడానికి..
కడిగిన బియ్యం -2 కప్పులు
నీళ్లు – 4 కప్పులు
ఉప్పు – తగినంత
పసుపు – 1 టేబుల్ స్పూన్
నూనె – 1 స్పూన్

చింతపండు కోసం..
చింతపండు – 50 గ్రాములు
నీళ్లు – 300ml

పులిహోర పొడి కోసం..
మిర్యాలు – 2 టేబుల్ స్పూన్లు
మెంతులు – ½ టేబుల్ స్పూన్
ధనియాల – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – ½ టేబుల్ స్పూన్
నల్ల నువ్వులు – 1 1/4టేబుల్ స్పూన్స్

పులిహోర పేస్ట్ కోసం..
నూనె – 85ml
ఆవాలు – 1 టేబుల్ స్పూన్
పచ్చిశనగపప్పు – 1 1/4టేబుల్ స్పూన్స్
మినపప్పు – 1 1/4టేబుల్ స్పూన్స్
పల్లీలు – 60 గ్రాములు
కరివేపాకు – 3 రెమ్మలు
ఇంగువ – 1/2టేబుల్ స్పూన్
బెల్లం – 3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం
1.చింతపండులో నీళ్లు పోసి, 30 నిముషాలు నానపెట్టి, పిప్పి తీసేసి, పులుసు పక్కనపెట్టుకోవాలి.
2.కడిగిన బియ్యంలో, నీళ్లు, ఉప్పు, పసుపు, నూనె వేసి కుక్కర్ కు మూత పెట్టి, మూడు విజిల్స్ రానివ్వాలి.
3.మూడు విజిల్స్ రాగానే కుక్కర్ మూత తీసి, నూనె రాసిన ప్లేట్ లో, అన్నం వేసి, గాలికి పూర్తిగా ఆరనివ్వాలి.
4. పులిహోర పొడి కోసం తీసుకున్న పదార్ధాలు అన్ని, ఒకోక్కటిగా వేపుకుని, మిక్సీ జార్ లో వేసి, మెత్తని పొడి చేసుకోవాలి.

5. ఇప్పుడు తాళింపు కోసం, స్టవ్ పై కడాయి పెట్టుకుని, నూనె వేసి, అందులో, అవాలు,శనగపప్పు, పల్లీలు, వేసుకొను వేగనివ్వాలి.
6. వేగిన తాళింపులో కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి.
7. అందులోకి, చింతపండు పులుసు, బెల్లం వేసి, రెండు పొంగులు రానిచ్చి, మిర్యాల పొడి వేసి ,కలుపుతూ చిక్క బరచాలి.
8. 20 నిముషాల తర్వాత పులుసు చిక్కబడుతుంది.
9.చిక్కపడిన పులుసు, స్టవ్ ఆఫ్ చేసి, వండిన అన్నం వేసి, నెమ్మదిగా పట్టించుకోవాలి.
10.కలుపుకున్న అన్నాన్ని, పక్కన పెట్టుకుని సెర్వ్ చేసుకోవాలి.