Sambar Rice:ఈ విధంగా సాంబార్ అన్నం చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది
Sambar Rice:ఈ విధంగా సాంబార్ అన్నం చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది.. సాంబార్ అన్నం జారుగా, పొట్టకు హాయిగా ఉండే సాంబార్ అంటే అందరికి ఇష్టమే. చిక్కటి సాంబార్ విత్ రైత్ తో, సాంబార్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
అన్నం ఉడికించడానికి ..
బియ్యం – 3/4కప్పు
కందిపప్పు – 1/3కప్పు
పసుపు – 1/2టేబుల్ స్పూన్
ఉప్పు – 1 టేబుల్ స్పూన్
నీళ్లు – 1 లీటర్
చింతపండు పులుసు కోసం..
చింతపండు – 40 గ్రాములు
కారం – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – 1/4టేబుల్ స్పూన్
బెల్లం – 35 గ్రాములు
సాంబార్ అన్నం కోసం..
నూనె – 6 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టేబుల్ స్పూన్
మెంతులు – ¼ టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 2
కరివేపాకు – 2 రెబ్బలు
ఇంగువ – కొద్దిగా
మునక్కాడలు – 8 ముక్కలు
ఉల్లిపాయ – 1/4కప్పు
సాంబార్ ఉల్లిపాయలు – 15
పచ్చిమిర్చి – 2
అరటి కాయ ముక్కలు – 10
క్యారేట్ ముక్కలు – 10
చిలకడ దుంప ముక్కలు – 10
బెండకాయ ముక్కలు – 7
ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు – 10
తీపి గుమ్ముడి ముక్కలు – 10
కాలీ ఫ్లవర్ ముక్కలు – 10
టమాటా ముక్కలు – 1/2కప్పు
వేడినీళ్లు – 1/2లీటర్
నెయ్యి – 1/4కప్పు
కొత్తిమీర తరుగు -1/4కప్పు
తయారీ విధానం
1.బియ్యం , కందిపప్పు కడిగి గంట సేపు నానపెట్టుకోవాలి.
2.నానిన బియ్యం పప్పును, ఉప్పు, పసుపు వేసి, కుక్కర్ లో పెట్టి, 4 విజిల్స్ రానివ్వాలి.
3.ఇప్పుడు చింతపండులో, వేడి నీళ్లు పోసి, నానిన తర్వాత, చింతపండు గుజ్జులో, సాంబార్ పొడి, కారం, ఉప్పు,పసుపు వేసి, పక్కన పెట్టుకోవాలి.
4. స్టవ్ పై బాండీ పెట్టుకుని, ఆయిల్ వేడి చేసి, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి, వేపుకోవాలి.
5. వేగిన తాళింపులో ఉల్లిపాయలతో సహా, కూరగాయ ముక్కలు అన్ని కలిపి, మూత పెట్టి, మెత్తపడే వరకు మగ్గనివ్వాలి.
6. మగ్గిన కూరగాయ ముక్కల్లో టమాటాలు వేసి, రెండు నిముషాలు వేపి, అందులోకి, చింతపులుసు పోసి, రెండు పొంగులు రానివ్వాలి.
7.ఆ తర్వాత, ఉడికిన పప్పు అన్నం, వేడి నీళ్లు కలపి, మూత పెట్టి, పది నిముషాలు ఉడికించుకోవాలి.
8. చివరగా కొత్తిమీర ,నెయ్యి, వేసి కలుపుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.