Masala Vada:సాయంత్రం సమయంలో మసాలా వడలను ఇలా చేసి తినండి..
Masala Vada:సాయంత్రం సమయంలో మసాలా వడలను ఇలా చేసి తినండి.. రుచి ఎంతో బాగుంటాయి.. అన్ని పప్పులు కలపి, మసాలాలు జోడించి,వడలు వేసి చూడండి.రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. సాయంత్రం సమయంలో వడలు తినటానికి చాలా రుచిగా ఉంటాయి.
కావాల్సిన పదార్ధాలు
మినపప్పు – 1/3కప్పు
పచ్చిశనగపప్పు – 1/3కప్పు
కందిపప్పు – 1/3కప్పు
సోంపు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
అల్లం – 1 ఇంచ్
లవంగాలు – 7
వెల్లుల్లి – 7
ఉప్పు – తగినంత
పచ్చిమిచ్చి – 4
కొత్తిమీర – 1/4కప్పు
ఎండుమిర్చి – 2
కరివేపాకు – 2 రెమ్మలు
ఉల్లిపాయ తరుగు – 1/2కప్పు
పుదీనా తరుగు – 1/4కప్పు
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
1.ఒక గిన్నెలో పప్పులన్ని వేసి, నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి.
2.నానిన పప్పును, పూర్తిగా వడకట్టి, షాపింగ్ మిషన్ లో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఎండుమిర్చి, వడకట్టిన పప్పులు వేసి, బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
3. గ్రైండ్ చేసుకున్న పప్పును, ఉల్లి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి, గట్టి పండిలా కలుపుకోవాలి.
4. ఇప్పుడు నానిన, పప్పులోనుంచి, పక్కన పెట్టుకున్న, పిడికెడు పప్పును, అందులో వేసుకోవాలి.
5. ఇప్పుడు కలుపుకున్న పిండి ముద్దను చేతులు తడి చేసుకుని, కొద్ది కొద్దిగా తీసుకుని, వడలుగా వత్తుకోవాలి.
6. వత్తుకున్న వడలను నూనెలో వేసి, మీడియం ఫ్లేమ్ పై, కాల్చుకోవాలి.
7. అంతే వేడి వేడి మసాల వడ రెడీ.