Gobi 65:క్యాటరింగ్ వాళ్ళు చేసే Gobi 65 ఇలా ఇంట్లోనే చేయండి..
Gobi 65:క్యాటరింగ్ వాళ్ళు చేసే Gobi 65 ఇలా ఇంట్లోనే చేయండి.. ప్రతి ఫంక్షన్లో కనిపించే గోబీ 65,ఇంట్లో చేయాలంటే చాలా కష్టం అనుకుంటారు.ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి. గోబీ 65 రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది.
కావాల్సిన పదార్ధాలు
నూనె – 3 టేబుల్ స్పూన్స్
వెల్లుల్లి – 2 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయ తరుగు – 3 టేబుల్ స్పూన్స్
పచ్చిమిర్చి – 2
కరివేపాకు – 2 రెమ్మలు
ఎండుమిర్చి – 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా
పెరుగు – 1 కప్పు
తయారీ విధానం
1.స్టవ్ పై బాండీ పెట్టి, నీళ్లు వేడి చేసుకుని, మరిగేనీటిలో, కాలీఫ్లవర్ ముక్కలు వేసి, 70 శాతం ఉడికించి, పూర్తిగా చల్లార నివ్వాలి.
2. పెరుగు మిశ్రమం కోసం ఉంచిన పదార్ధాలు అన్ని, కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
3.చల్లారిన కాలీఫ్లవర్ ముక్కల్లో మైదా, కార్న్ ఫ్లోర్ , తగినన్ని నీళ్లు వేసి, టాస్ చేసి, నెమ్మదిగా, పిండిని పట్టించాలి.
4. పిండిని కోట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలను, వేడి నూనెలో వేసి, మీడియం ఫ్లేమ్ పై ఎర్రగా వేపుకోవాలి.
5. వేరొక ప్యాన్ లో నూనె బాగా వేడి చేసి, అందులోకి, ఎండుమిర్చి వేసి, వేపుకోవాలి.
6. తర్వాత, కరివేపాకు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసుకుని, హై ఫ్లేమ్ పై టాస్ చేసుకోవాలి.
7. వేగిన తాళింపు లోకి, పెరుగు మిశ్రమం వేసి, బాగా కలుపుతూ చిక్కపడనివ్వాలి.
8.చిక్కపడిన పెరుగు మిశ్రమంలో, వేపుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి, హై ఫ్లేమ్ పై దగ్గర పడే వరకు టాస్ చేసుకోవాలి.
9.చివరగా కొత్తిమీర చల్లుకుని,స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.