Devotional

Broom in the kitchen:వంట గదిలో చీపురును ఉంచుకోవచ్చా.. చీపురును ఎప్పుడు కొనాలో తెలుసా ?

Broom in the kitchen:వంట గదిలో చీపురును ఉంచుకోవచ్చా.. చీపురును ఎప్పుడు కొనాలో తెలుసా.. మనం ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకోవటానికి చీపురును ఉపయోగిస్తాం. చీపురును సాక్షాత్తు లక్ష్మీదేవి గా భావిస్తాం. అందువలన చీపురును తొక్కకూడదు అని ఎలా పడితే అలా వాడకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు.

చీపురును బహిరంగ ప్రదేశాలలో ఉంచకూడదు. ఎల్లప్పుడూ పశ్చిమదిశలో ఎవరికీ కనిపించకుండా ఉంచాలి. అలాగే వంట గదిలో కూడా ఉంచకూడదు. సూర్య అస్తమయం అయిన తర్వాత కూడా చీపురును ఉపయోగించకూడదు.

విరిగిపోయిన చీపురును ఇల్లు శుభ్రం చేయడానికి ఉపయోగించకూడదు. ఇలా చేయడం వలన ఇంట్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చీపురును ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయకూడదు. కృష్ణపక్షంలో కొనుగోలు చేసి శనివారం ఉపయోగించడం వల్ల ఎంతో మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే చీపురును కాళ్లతో తన్నకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.