Moviesvantalu

Tollywood:హిట్ అవ్వాల్సిన ఈ సినిమాలు ఎందుకు ప్లాప్ అయ్యాయో చూడండి

Tollywood:హిట్ అవ్వాల్సిన ఈ సినిమాలు ఎందుకు ప్లాప్ అయ్యాయో చూడండి.. అక్కినేని నాగార్జున ఎక్కువ ప్రయోగాలు చేసాడని చెప్పాలి. అలా చేసిన మూవీల్లో గగనం ఒకటి. విమానం హైజాక్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? టెర్రరిస్టులనుంచి ఎలా కాపాడాలి?అనేది సప్సెన్స్ గా నడుస్తుంది. హీరో ఒక్కడే కాదు,విమానంలో ప్రయాణికులను కూడా హీరోయిజంగా చూపించారు. సస్పెన్స్ థ్రిల్లర్ లో కూడా బ్రహ్మానందం నవ్వించే సీన్.

అమ్మతనం ఏ దేశంలో అయినా ఒకేలా ఉంటుందని చాటడమే కాదు, ప్రేమ యుద్ధంగా కూడా ఉంటుందని చూపించిన సినిమా కంచె. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో వరుణ్ తేజ్ హీరోగా మంచి నటన కనబరిచాడు. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. ఫారిన్ అమ్మాయి సైనికులను కాపాడే సీన్ ఇందులో బాగా కనెక్ట్ అవుతుంది. మెగాస్టార్ కి కూడా బాగా నచ్చిన సీన్ ఇది. అయితే హీరో చనిపోయిన పుడు ఎమోషనల్ అన్పించకపోవడమే ఈ సినిమాలో లోటుగా కొందరు చెబుతారు.

ఇక తేజ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన మూవీ నిజం. మహేష్ నటనకు నంది అవార్డు వచ్చినప్పటికీ ఎందుకో ఈ మూవీ అప్పట్లో ఫెయిల్ అయింది. అవినీతిపై యుద్ధం ప్రకటించిన ఈ మూవీలో హీరో పిరికివాడు గా ఉంటూ ఎలా ధైర్యం చూపాడన్నదే కథ. అయితే విలన్ గా గోపీచంద్ అదరగొట్టేసాడు.

ఓ మంచి సినిమా తీసుకు రావాలని శర్వానంద్ నిర్మించి,నటించిన మూవీ కో అంటే కోటి .చాలామందికి ఈ మూవీ గురించి తెలీదు. రామ్ చరణ్ ,శర్వానంద్ క్లాస్ మేట్స్. శర్వానంద్ లో నచ్చేది ఏమిటంటే రణరంగంలో చూపిన ఇంటెన్సిటీ అని చెర్రీ అంటాడు. కో అంటే కోటి మూవీ ని యాక్టర్ అనీష్ కురివేళ్ళ డైరెక్ట్ చేసాడు. ఆవకాయ్ బిర్యానీ కూడా ఆయన తెరెకెక్కించిందే.

మెంటల్ మదిలో అనే మూవీ వచ్చిన సంగతి కూడా చాలామందికి తెలీదు. బ్రోచేవారెవరురా మూవీతో వివేక్ ఆత్రేయకు మంచి పేరు వచ్చింది. కానీ కన్ఫ్యూజ్ గయ్ తో సినిమా తీయొచ్చని చాటిన మూవీ మెంటల్ మదిలో.. స్వేచ్ఛ, రేణుక ఇద్దరు హీరోయిన్స్ . హీరోగా అరవింద్ కృష్ణ చేసాడు.