Mahesh babu:మహేష్ బాబు అద్భుతంగా నటించిన 10 సినిమాలు…మీరు చూసారా ?
Mahesh Babu:మహేష్ బాబు అద్భుతంగా నటించిన 10 సినిమాలు…మీరు చూసారా.. సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వంగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు 45ఏళ్ళు వచ్చినా పాతికేళ్ల కుర్రాడిగానే ఉంటాడు. పాతిక సినిమాలకు పైగా చేసిన మహేష్ బాబు ని స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా ఒక్కడు.
గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో భూమిక హీరోయిన్. ప్రకాష్ రాజ్ విలన్. అలాగే మహేష్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసిన సినిమా మురారి. అమాయకత్వంగా,అల్లరిగా, తిరబడే తత్త్వం,ఎమోషనల్ సీన్స్ ఇలా అన్ని రకాలుగా మహేష్ అందులో చేసిన నటన సూపర్భ్.
మహేష్ బాబు కెరీర్ మొదట్లో చేసిన సినిమా నిజం. ఫలితం ఎలా ఉన్నా, నటన పరముగా అదరగొట్టాడు. పిరికితనం చూపిస్తూనే అవినీతి అంతానికి చేసిన కృషి అద్భుతం. రెండు విభిన్న కోణాల్లో చేసిన నటనకు నంది అవార్డు వచ్చింది.
మహేష్ బాబు కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మూవీ పోకిరి. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో ‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతోందో ఆడే పండుగాడు’అనే డైలాగ్ ఎంతలా పాపులర్ అయిందో చెప్పలేం. పండుగాడు తప్ప మహేష్ బాబు కనిపించడు అన్నట్లుగా పాత్రలో లీనమై నటించాడు.
బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ నటన చూసాక ఫాన్స్ మళ్ళీ అలంటి రోల్ లో చూడాలని ఫీలవుతూ ఉంటారు. అంతలా అదరగొట్టాడు. డైలాగ్స్ , టేకింగ్ చూస్తే సూర్యా భాయ్ లా ఉండాలని అనిపించేలా క్రియేట్ చేసాడు.
ఖలేజా మూవీ చూస్తుంటే మహేష్ ని కొత్త యాంగిల్ లో ఆవిష్కరించారని విశ్లేషకుల అంచనా. దూకుడు మూవీ చూస్తే మహేష్ కామెడీ,యాక్షన్ సీన్స్,డైలాగ్స్,సాంగ్స్, ఎమోషన్స్ అన్నీ సూపర్ గా కుదిరాయి. అందుకే పూర్తిస్థాయి యాక్షన్ గల హీరో గా నిలబెట్టింది ఈ మూవీ.
డబ్బే ఆనందాన్ని ఇస్తుందనుకోవడం సరికాదని చాటిచెప్పిన క్యారెక్టర్ లో మహేష్ బాబు ఇమిడిపోయి నటించిన సినిమా శ్రీమంతుడు. క్యూట్ గా, మోడర్న్ గా మహేష్ అదరగొట్టాడు. వన్ నేనొక్కడినే మూవీ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చింది. సినిమా అర్ధంకానట్లు ఉంటుంది కానీ అతడి నటన మాములుగా ఉండదు.
ఏది నిజమో,ఏది ఊహ తెలీని మధ్యలో కొట్టుమిట్టాడే పాత్రలోఏడవడం లాంటి సీన్లో మహేష్ అదరగొట్టాడు. చిన్నపిల్లాడిలా ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో సాఫ్ట్ హీరోగా కనిపిస్తాడు. విక్టరీ వెంకటేష్ తో కల్సి మల్టీస్టారర్ మూవీగా చేసిన ఇందులో యాస,వెటకారం బాగా ఆకట్టుకుంటాయి.