Kitchenvantalu

Crispy Aloo Fry:ఆలూ ఫ్రై పొడి పొడిగా రంగు రుచి పర్ఫెక్ట్ గా రావాలంటే ఇలా చేయాల్సిందే..

Crispy Aloo Fry:ఆలూ ఫ్రై పొడి పొడిగా రంగు రుచి పర్ఫెక్ట్ గా రావాలంటే ఇలా చేయాల్సిందే.. పప్పు,చారు,రసం లోకి పర్ ఫెక్ట్ సైడ్ డిష్ గా ఆలుఫ్రై చేస్కోండి.విడివిడిగా గ్రేవీ లేకుండా..క్రిస్పి క్రిస్పి ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్ధాలు
పొడి కోసం..
మినపప్పు – 3 టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి – తగినన్ని
జీలకర్ర – ½ టేబుల్ స్పూన్
వేపుడు కోసం..
ఆలు – ½ kg
నూనె – 6 టేబుల్ స్పూన్స్
ఆవాలు – ½ టేబుల్ స్పూన్
జీలకర్ర – ½ టేబుల్ స్పూన్
వెల్లుల్లి – 3 రెబ్బలు
ఇంగువ – 2 చిటికెలు
కరివేపాకు – 2 రెమ్మలు
పసుపు – 1/8 టేబుల్ స్పూన్
కారం – ½ – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత

తయారీ విధానం
1.ఆలుని చెక్కు తీసి సమానంగా ముక్కలుగా కట్ చేసుకోని నీళ్లలో వేసి పెట్టుకోవాలి.
2.పొడికోసం తీసుకున్న మినపప్పు,ఎండుమిర్చి లో ఫ్లేమ్ పై దోరగా వేపుకోని చల్లారక మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
3.నీళ్లలో నానబెట్టిన ఆలు ముక్కలను మరిగే నీళ్లలో వేసి అంచుల వెంట పొంగు వచ్చే వరకు మరిగించాలి.
4.ఉడికిన ఆలుని వడకట్టి పక్కన పెట్టుకోవాలి.

5.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడిచేసి అందులోకి ఆవాలు,జీలకర్ర,ఇంగువ,కరివేపాకు వేసి తాలింపు వేపుకోవాలి.
6.వేగిన తాలింపులో చల్లారిన ఆలు ముక్కలు వేసి నూనె పట్టేలా కలుపుకోవాలి.
7.మీడియం ఫ్లేమ్ లో మద్య మద్య లో కలుపుతూ ముక్కలు కర కరలాడే లాగ వేపుకోవాలి.
8.ఆలు గోల్డెన్ కలర్ లోకి మారిన తర్వాత అందులోకి పసుపు,కారం వేసి మరి కాసేపు వేపుకోవాలి.
9.చివరగా గ్రైండ్ చేసుకున్న మినపప్పు కారం వేసి టాస్ చేసుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
10. అంతే కర కరలాడే స్పైసీ ఆలు ఫ్రై రెడీ.