Mamidikaya Kobbari Pachadi:మామిడికాయలతో ఇలా కొబ్బరిపచ్చడి చేయండి.. రుచి అదిరిపోతుంది..!
Mamidikaya Kobbari Pachadi:మామిడికాయలతో ఇలా కొబ్బరిపచ్చడి చేయండి.. రుచి అదిరిపోతుంది.. సీజన్ లో మాత్రమే దొరికే మామిడి కాయలతో నిల్వ పచ్చల్లే కాకుండా అప్పటికప్పుడు చేసే రోటి పచ్చల్లు కూడా ఎంజాయ్ చెయ్యాలి. పుల్లటి మామిడికాయకు తోడుగా,తియ్యటి కొబ్బరి యాడ్ చేసి రోటి పచ్చడి చేసేయండి.
కావాల్సిన పదార్ధాలు
పచ్చికొబ్బరి – 1 ¼ కప్పు
పచ్చిమిర్చి – 6-8
జీలకర్ర – ½ టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
వెల్లుల్లి – 6-7
పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్
పుల్లిన మామిడికాయ – ½ కప్పు
కొత్తిమీర – 1 కట్ట
తాలింపు కోసం..
నూనె – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టేబుల్ స్పూన్
శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
మినపప్పు – 1 టేబుల్ స్పూన్
ఇంగువ – 2 చిటికెలు
అల్లం తురుము – 1 టేబుల్ స్పూన్
ఎండు మిర్చి – 2
పసుపు – ½ టేబుల్ స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని పల్లీలు వేపుకోని మిక్సీలో తీసుకోండి.అందులోకి పచ్చిమిర్చి,వెల్లుల్లి,ఉప్పు,జీలకర్ర వేసి బరకగా గ్రౌండ్ చేసుకోండి.
2.తరువాత పచ్చికొబ్బరి కొత్తిమీర వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
3.చివర్లో మామిడికాయ ముక్కలు కూడ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి.
4.తాలింపుకోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేసి తాలింపు కోసం తీసుకున్న పదార్ధాలతో పోపు వేసుకోని వేగిన తాలింపును గ్రైండ్ చేసుకున్న పచ్చడి లోకి కలుపుకోవాలి.
5.అంతే టేస్టీ టేస్టీ మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ.