Face Glow Tips:బియ్యంపిండిలో వీటిని కలిపి ముఖానికి రాస్తే ముఖం మిలమిలా మెరుస్తుంది
Face Glow Tips:బియ్యంపిండిలో వీటిని కలిపి ముఖానికి రాస్తే ముఖం మిలమిలా మెరుస్తుంది.. మనం ప్రతి రోజు ఉపయోగించే బియ్యం పిండిలో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఎన్నో చర్మ సమస్యలను తగ్గిస్తుంది. బియ్యం పిండిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే ఎలాస్టేస్ అనే హానికరమైన సమ్మేళనం యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది.
ఈ ప్యాక్ వేయటం వలన చర్మరంధ్రాలు బిగుతుగా మారతాయి. చర్మాన్ని టోన్ చేస్తుంది. అందువలన, ఇది చమురు స్థాయిలను సమతుల్యం చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణలు ఉండుట వలన దురద మరియు మంట నుండి ఉపసమనం కలిగిస్తుంది.
చర్మ కణాలను మరమత్తు చేయటమే కాకుండా కాలుష్యం మరియు ఫ్రీ రాడికల్స్ నుండి కూడా రక్షిస్తుంది. బియ్యం పిండి ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించడం వల్ల టాన్‌ను మరియు తేలికపాటి సూర్యరశ్మి వలన కలిగే ప్రభావాలను కూడా తగ్గించవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పే పేస్ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది.
ఒక బౌల్ లో ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ ఓట్స్ పొడి, అరస్పూన్ తేనే, రెండు స్పూన్ల పాలు వేసి బాగా కలిపి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే నల్లగా ఉన్న ముఖం తెల్లగా మెరుస్తుంది.
ఇప్పుడు చెప్పే ప్యాక్ మొటిమలను తగ్గించటానికి సహాయపడుతుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ బియ్యం పిండి, నాలుగు చుక్కల ఆముదం, అరస్పూన్ రోజ్ water, కొంచెం నీటిని పోసి పేస్ట్ సెహ్యాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.