Weight Loss:15 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట,తొడల చుట్టూ ఉన్న కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది..
Weight Loss:15 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట,తొడల చుట్టూ ఉన్న కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది.. మనలో చాలా మంది అధిక బరువు, శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అయితే అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. అయితే మంచి పోషకాలు ఉన్న ఆహారం తింటూ రోజులో కనీసం అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే మంచి ఫలితం కనపడుతుంది.
దీని కోసం ఒక పొడిని తయారుచేసుకోవాలి. ఒక్కసారి ఈ పొడిని తయారుచేసుకుంటే దాదాపుగా 15 రోజుల పాటు వాడుకోవచ్చు. ఒక పాన్ లో ఒక స్పూన్ ఆవిసే గింజలు, ఒక స్పూన్ వాము,ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సొంపు వేసి సిమ్ లో పెట్టి మంచి ఫ్లెవర్ వచ్చేవరకు వేగించాలి. బాగా వేగాక మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. నాలుగు సమాన బాగాలుగా తీసుకోవాలి.
ఈ పొడిని గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడి వేసుకొని బాగా కలిపి తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. ఈ పొడికి ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ శరీరంలో జీవక్రియ రేటును పెంచటానికి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.