Liver:ఈ లక్షణాలు ఉంటే…మీ లివర్ ప్రమాదంలో పడినట్టే…అసలు అశ్రద్ద చేయవద్దు
Liver:ఈ లక్షణాలు ఉంటే…మీ లివర్ ప్రమాదంలో పడినట్టే…అసలు అశ్రద్ద చేయవద్దు.. మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కాలేయం. కాలేయం పనితీరు బాగుంటేనే శరీరంలో మలినాలు విషపదార్థాలు అన్నీ బయటకు పోతాయి.
అలాగే మనం తీసుకునే ఆహారం జీర్ణం చేయడంలోనూ శరీరానికి అవసరమైన శక్తిని తయారు చేయడంలోనూ కాలేయం కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఇటువంటి కాలేయంను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
కాలేయం ఆరోగ్యం పాడై పోయిందని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే కాలేయం 90% పాడైన లక్షణాలు మాత్రం బయటకు కనబడవు. కానీ కొన్ని లక్షణాలను బట్టి లివర్ డ్యామేజ్ ని గుర్తించవచ్చు. కాలేయం పాడైనప్పుడు యూరిన్ ఉదా ముదురు రంగులోకి మారుతుంది. ఇలా అప్పుడప్పుడు అయితే పర్వాలేదు కానీ రెగ్యులర్ గా ఇలానే ఉంటే మాత్రం డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి.
అకస్మాత్తుగా బరువు పెరుగుతున్న లివర్ లో సమస్య ఉందని భావించాలి. తరచుగా తీసుకున్న ఆహారం జీర్ణం కాక పోయినా వికారం వాంతులు ఉన్న లివర్ ప్రమాదంలో ఉందని గుర్తించాలి. తీవ్రమైన అలసట ఉంటుంది. ఏ మాత్రం పని చేయలేరు. నిస్సత్తువగా ఉంటారు. చాలా వీక్‌గా ఉంటారు. ఏ పనిచేయబోయినా అలసిపోయినట్టు ఉంటారు. ఈ లక్షణాలు తరచుగా ఉంటే తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.