Almond for face:బాదంతో ఇలా చేస్తే మెరిసే కాంతివంతమైన చర్మం మీ సొంతం
Almond for face:బాదంతో ఇలా చేస్తే మెరిసే కాంతివంతమైన చర్మం మీ సొంతం.. బాదంపప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం మన అందరికి తెలిసిన విషయమే. అయితే బాదం పప్పులో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియకపోవటం వలన బాదంను కేవలం ఆరోగ్య ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారు.
మనలో చాలామంది ఈ బాదం పప్పు తింటే చాలా మంచిదని రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం బాదంపప్పు పై తొక్క తీసేసి తింటూ ఉంటారు ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరగడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు.అయితే మనకు బాదంలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మాత్రమే తెలుసు కానీ Beauty ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి.
సౌందర్యాన్ని మెరుగు పరచడంలో బాదం చాలా బాగా సహాయపడుతుంది. చర్మం కాంతివంతంగా మృదువుగా మారటానికి బాదం ఎలా ఉపయోగించాలి. బాదం పప్పులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తొక్కతీసి మెత్తని పేస్ట్ గా చేసి దానిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చర్మంపై ఉన్న మృత కణాలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మం మీద ఉన్న నల్లని మచ్చలు,మొటిమలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
బాదంలో ఉన్న పోషకాలు చర్మ సంరక్షణలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ లో ఉపయోగించిన రోజ్ water లో ఉన్న లక్షణాలు చర్మ సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అవ్వండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.