Red Onion:షుగర్ ఉన్నవారు ఎర్ర ఉల్లిపాయ తింటే ఏమి అవుతుందో తెలుసా ?
Red Onion:షుగర్ ఉన్నవారు ఎర్ర ఉల్లిపాయ తింటే ఏమి అవుతుందో తెలుసా.. డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నిర్వహణలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి.
డయాబెటిస్ ఉన్నవారు ఎర్ర ఉల్లిపాయ తింటే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. ఉల్లిపాయలలో తెల్ల ఉల్లిపాయ,ఎర్ర ఉల్లిపాయ అనే రెండు రకాలు విరివిగా లభ్యం అవుతున్నాయి. తెల్ల ఉల్లిపాయతో పోలిస్తే ఎర్ర ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎక్కువ మేలును చేస్తుంది. ఎర్ర ఉల్లిపాయలో విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి.
అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఉన్న పోషకాలు డయాబెటిస్ నియంత్రణలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి.
ఉల్లిపాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ 10. అందువల్ల ఉల్లిపాయను ఆహారంలో చేర్చుకుంటే మంచిదని నిపుణులు చెప్పుతున్నారు. ఎర్ర ఉల్లిపాయలో క్రోమియం సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిల నిర్వహణలో సహాయపడి డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి ఎర్ర ఉల్లిపాయను తినటానికి ప్రయత్నం చేయండి.
ploads/2021/05/diabetes-300×167.jpg” alt=”Diabetes In Telugu” width=”300″ height=”167″ class=”alignnone size-medium wp-image-41902″ />
ఇలా ఆహార నియమాలను పాటిస్తూ ప్రతి రోజు అరగంట యోగా లేదా వ్యాయామం చేయాలి. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉంటే మంచిది. డయాబెటిస్ ఉన్నవారు ఖచ్చితంగా మందులను వాడాలి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.