White Hair Turn Black:తెల్ల జుట్టు రావడం మొదలైందా? అయితే ఇలా చేస్తే సరి
White Hair Turn Black:తెల్ల జుట్టు రావడం మొదలైందా? అయితే ఇలా చేస్తే సరి.. వయస్సు పెరిగే కొద్ది తెల్లజుట్టు రావటం అనేది సహజమే. కానీ ఈ రోజుల్లో చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య ప్రారంభం అవుతుంది. అలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావటంతో మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉన్నారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
అలా కాకుండా మన ఇంటిలోనే సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కాస్త,ఓపిక సమయం ఉంటే సరిపోతుంది. తెల్ల జుట్టు రావడం ప్రారంభం అయినా వెంటనే ఈ చిట్కా ఫాలో అయితే సరిపోతుంది.
పది వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక స్పూన్ స్పూన్ మిరియాలను కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి పొయ్యి మీద మందపాటి గిన్నెను పెట్టుకుని ఒక కప్పు కొబ్బరి నూనెను పోసి కాస్త వేడి అయ్యాక తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు,దంచి పెట్టుకున్న మిరియాలు,రెండు టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు వేసుకుని చిన్న మంటపై పది నిమిషాల పాటు మరిగించాలి.
ఇలా మరిగిన నూనెను చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత స్ట్రైనర్ సాయంతో నూనెను వడకట్టి నిల్వ చేసుకుంటే దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు ఈ నూనెను జుట్టుకి పట్టించి 5 నిమిషాలు మసాజ్ చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
కాస్త ఓపికగా చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చులో సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ నూనె జుట్టు కుడుళ్ళను బలంగా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.