Joint Pains:కీళ్ల నొప్పులు ఉన్నవారు టమోటా తింటే ఏమి అవుతుందో తెలుసా?
Joint Pains:కీళ్ల నొప్పులు ఉన్నవారు టమోటా తింటే ఏమి అవుతుందో తెలుసా.. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే అంటే 30 నుంచి 40 ఏళ్ల వయసులోనే కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి.
ఒకప్పుడు 60 ఏళ్ల వయసులో కీళ్లు అరిగి కీళ్ల నొప్పులు వచ్చేయి. కీళ్ల నొప్పులు తగ్గించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు కీళ్ల నొప్పులు రావడానికి మారిన జీవన శైలి, పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత వంటివి కారణాలుగా చెప్పవచ్చు.
కొన్ని ఆహారాలు తీసుకుంటే కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే కొన్ని. ఆహారాలు తీసుకుంటే కీళ్ల నొప్పులు పెరుగుతాయి. అలాంటి ఆహారాలలో టమోటా ఒకటి. టమోటాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కీళ్ల నొప్పులు ఉన్నవారు టమోటాకి దూరంగా ఉంటేనే మంచిది.
ఎందుకంటే కీళ్ళ నొప్పులకు కారణమైన యూరిక్ యాసిడ్ టమోటాలో ఎక్కువగా ఉంటుంది.యూరిక్ యాసిడ్ కారణంగా కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి. అందువల్ల నొప్పులు ఉన్నవారు టమోటాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
టమోటాలు సహజంగా సోలనిన్ అనే టాక్సిన్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ టాక్సిన్ వాపు మరియు కీళ్ల నొప్పులకు దోహదం చేస్తుంది. అందువల్ల కీళ్ల నొప్పులను ప్రభావితం చేసే ఆహారాలకు దూరంగా ఉంటేనే మంచిది. మన ఆరోగ్యం విషయాంలో ఆహారం కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.