Kitchen Tips:నిత్య జీవితంలో ఉపయోగపడే వంటింటి చిట్కాలు..
Kitchen Tips:నిత్య జీవితంలో ఉపయోగపడే వంటింటి చిట్కాలు… వంటింటిలో కొన్ని చిట్కాలను పాటిస్తే వంట తొందరగా అవ్వటమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది.
గ్రేవీ తయారుచేసినపుడు ఒక్కోసారి పలుచగా అయ్యిపోతుంది. ఆ గ్రేవీ పలుచగా కాకుండా థిక్ గా ఉండాలంటే ఒక బంగాళాదుంపను ఉడికించి మెత్తగా చేసి గ్రేవీలో కలపాలి.
కూరల్లో వేసుకోవటానికి బఠాణీలను నానబెట్టటం మర్చిపోతూ ఉంటాం. బఠాణీలు తొందరగా నానాలంటే వేడినీటిలో కొంచెం వంట సోడా వేసి బఠాణీలను వేస్తె రెండు గంటల్లో నాని కూరల్లో వేసుకోవటానికి అనువుగా ఉంటాయి.
బిస్కెట్స్ మెత్తపడకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే బిస్కెట్స్ వేసే డబ్బాలో ముందుగా ఒక స్పూన్ పంచదార వేసి బిస్కెట్స్ స్టోర్ చేస్తే మెత్తపడకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
బొంబాయి రవ్వ పురుగు పట్టకుండా ఉండాలంటే బొంబాయి రవ్వను రెండు నిముషాలు వేగించి డబ్బాలో స్టోర్ చేయాలి.
కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి వేరు చేయటం చాలా కష్టమైన పని. ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి సులభంగా వచ్చేస్తుంది. కొబ్బరి చిప్పను స్టవ్ మీద పెట్టు రెండు నిముషాలు వేడి చేయాలి. కొంచెం చల్లారాక కొబ్బరి చిప్పను సుత్తితో కొడితే కొబ్బరి షెల్ తొందరగా ఊడి కొబ్బరి సులభంగా వచ్చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.