Kanda:ఈ దుంపను వారంలో 2 సార్లు తింటే ఊహించని ఎన్నో ప్రయోజనాలు…
Kanda:ఈ దుంపను వారంలో 2 సార్లు తింటే ఊహించని ఎన్నో ప్రయోజనాలు… మనకు ఎన్నో రకాల దుంపలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని దుంపలను మనలో చాలా మంది తినటానికి ఇష్టపడరు. కందలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మనలో చాలామంది కంద దురదగా ఉంటుందని తినటానికి పెద్దగా ఇష్టపడరు. కంద దురద లేకుండా నూనె, ఉప్పు లేకుండా కంద ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది.
కందను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో కంద ముక్కలు, రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక స్పూన్ తేనె, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఆవిరిపై 70% మాత్రమే ఉడికించాలి. ఆ తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టి ఒక స్పూన్ . మీగడ వేసి దానిలో ఉడికించిన కంద ముక్కలను వేసి నాలుగు నిమిషాలు మగ్గించాలి. .
ఆ తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ జీలకర్ర పొడి, రెండు స్పూన్ల పుట్నాల పప్పు పొడి వేసి బాగా కలపాలి. పుట్నాల పప్పు పొడి వేసుకోవడం వలన ఫ్రై లో ఉన్న తేమను పీల్చి కంద ముక్కలు క్రిస్పీగా ఉండేలా చేస్తుంది. ఆ తర్వాత ఒక స్పూన్ వేగించిన నువ్వులను వేసి బాగా కలిపి రెండు నిమిషాలు అయ్యాక కొత్తిమీర చల్లి ఒక బౌల్ లోకి తీసుకుంటే క్రిస్పీగా టేస్టీగా ఉండే కంద ఫ్రై రెడీ.
ఈ Fry ని వారంలో రెండు సార్లు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. అలాగే ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. అలా అధిక బరువు ఉన్నవారికి మంచి ప్రయోజనం కలిగిస్తుంది.
మహిళల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తిని పెంచుతుంది. కీళ్ల నొప్పులను నివారిస్తుంది. కందలో ఫైబర్ ఎక్కువ, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండుట వలన డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు లేకుండా నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, సెలెనియం, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్… మెమరీ పవర్ పెంచుతాయి. మెదడు నరాలను చురుగ్గా ఉంచుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.