Smart Phones:మీరు మొబైల్‌కు బానిస అయ్యారా… ఒకసారి ఇలా చెక్ చేసుకోండి..
Smart Phones:మీరు మొబైల్‌కు బానిస అయ్యారా… ఒకసారి ఇలా చెక్ చేసుకోండి… ఈ మధ్య కాలంలో మొబైల్స్ వినియోగం అనేది భారీగా పెరిగి పోయింది.ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆన్లైన్ క్లాస్ లు ఉండటం వలన చిన్న పిల్లల చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ లు ఉంటున్నాయి. దాంతో వారు కూడా ఫోన్ పట్టుకొని వదలటం లేదు.
స్మార్ట్ ఫోన్ వినియోగం ఏ స్థాయిలో అంటే ప్రపంచం నాశనం కాబోతుందా అనేంత ప్రమాదకర స్థాయిలోకి వచ్చింది.పక్క మనుషులతో కూడా మాట్లాడకుండా ఎప్పుడు చూసినా కూడా చేతిలో మొబైల్స్ పట్టుకునే ఉంటున్నారు.పక్కన మనిషి ఉన్నా కూడా ఆ వ్యక్తితో చాట్ లోనే మాట్లాడటం చేస్తున్నారు….
కొన్నేల క్రితం వరకు ఫీచర్ ఫోన్స్ వల్ల పెద్దగా ఇబ్బంది లేకపోయేది.కాని ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత వాటి వినియోగం చూసి శాస్త్రవేత్తలు కూడా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఇది ఇలాగే కొనసాగితే 2.ఓ చిత్రంలో చూపించినట్లుగా పక్షి రాజులా ఎవరో ఒకరు ఆత్మలా మారి మొబైల్స్ వాడే వారి అంతు చూసినా చూస్తారు.
ఇప్పటికే ప్రపంచం అత్యంత కాలుష్యం అయ్యింది.ఇప్పుడు రేడియేషన్స్ వల్ల ప్రపంచం నాశనం అవుతుంది.వాతావరణం, ఇతర ప్రపంచంను పక్కన పెడితే స్మార్ట్ ఫోన్ వల్ల మీరు ఏ స్థాయిలో ప్రభావితం అవుతున్నారో మీకే తెలియడం లేదు.మొబైల్ లేకుండా పోతే పిచ్చి వారు అయ్యే స్థాయికి మీరు చేరుకున్నారంటే మీరు నమ్మగలరా.
మీరు ఏ స్థాయిలో మొబైల్స్‌కు బానిస అయ్యారో మీరే చిన్న చిన్న పరీక్షలు పెట్టుకుని చూసుకోండి.అప్పుడు ఏ స్థాయిలో మీరు మొబైల్‌కు అడిక్ట్ అయ్యారో తెలుస్తుంది.
ఇలా మీరు పరీక్షించుకోండి.
మొబైల్ ను ఇంట్లో పెట్టి బయటకు వెళ్లండి.అప్పుడు ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఉంటే పర్వాలేదు, కాని బయట ఏ పని చేయబుద్ది కాక పోవడం, వెంటనే ఫోన్‌ను చేతిలోకి తీసుకోవాలి, ఇంటికి వెళ్లాలి అనిపించడం వంటి సింటమ్స్ మీరు మొబైల్ కు బానిస అయ్యారన్నట్లే.
ఫోన్ ఎవరి చేతిలో అయినా పలిగినా లేదంటే ఎవరైనా ఫోన్ ను పాడు చేసినా కూడా వారిపై విపరీతమైన కోపం తెచ్చుకోవడం, వారు సొంత వారు అయినా కూడా వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం వంటివి చేస్తే మీరు బందాల కంటే ఎక్కువ ఫోన్‌కు విలువ ఇస్తూ ఫోన్‌కు బానిస అయినట్లే.
ఫోన్ కొంత సమయం కనిపించకుండా పోతే అన్నం తినకుండా ఉండటం, ఫోన్ కనిపించే వరకు చిరాకు పడటం వంటివి చేసినా కూడా మీరు ఫోన్ బానిసగా చెప్పుకోవచ్చు.
ప్రతి అయిదు నిమిషాలకు ఒకసారి లేదా అంతకంటే తక్కువ సమయంకు పదే పదే ఫోన్ ను తీస్తూ చూస్తూ ఉంటే మీరు ఫోన్ మైకంలో నిండా మునిగినట్లే.
ఫోన్లో మాట్లాడని రోజు, ఫోన్‌ను చూడని రోజు ప్రశాంతత కోల్పోయినట్లుగా ప్రవర్తిస్తే మీరు మొబైల్‌కు బానిస అయినట్లే.
పై లక్షణాలు మీలో ఏమైనా ఉంటే వెంటనే జాగ్రత్త పడండి.లేదంటే ఇది మరో లెవల్‌కు వెళ్లి పిచ్చివాళ్లు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.