Face Glow Tips:ఈ నూనెతో ముఖానికి మసాజ్ చేస్తే చాలు..నల్లని మచ్చలు మాయం
Face Glow Tips:ఈ నూనెతో ముఖానికి మసాజ్ చేస్తే చాలు..నల్లని మచ్చలు మాయం.. ముఖ సంరక్షణ కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టటమే కాకుండా ఎంతో విలువైన సమయాన్ని కూడా వృదా చేసేస్తూ ఉంటారు. ముఖం అందంగా, తెల్లగా మెరవాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
అది సహజమే. కానీ దాని కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలోనే సులభంగా చేసుకోవచ్చు. దీని కోసం FISH OIL చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. Fish Oil మెడికల్ షొప్స్,online స్టోర్స్ లో లభ్యం అవుతుంది.
Fish Oil లో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ సమృద్దిగా ఉంటాయి. ఇవి ముఖం మీద మచ్చలు,ముడతలు లేకుండా చేయటమే కాకుండా ముఖం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది. Fish Oil ఒక capsule తీసుకొని దానిలోని ఆయిల్ ని ముఖానికి రాసి సున్నితంగా 5 నిమిషాలు మసాజ్ చేస్తే ముడతలు,మొటిమలు అన్నీ తొలగిపోతాయి.
నల్లని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాస్తే క్రమంగా మచ్చలు అన్నీ తొలగిపోతాయి. ఒక స్పూన్ తేనెలో Fish Oil వేసి బాగా కలిపి ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం పొడిగా లేకుండా తేమగా ఉంటుంది. చర్మం పొడిగా ఉన్నవారికి ఇలా చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.