Vidyut jamwal:ఈ విలన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?
Bollywood actor vidyut jamwal :టాలీవుడ్ మెహర్ రమేష్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి మూవీలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించి సినీ ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ ప్రముఖ నటుడు విద్యుత్ జమాన్వాల్.
విద్యుత్ జమాన్వాల్ మొదట విలన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ క్రమ క్రమంగా తన నటనా ప్రతిభ నిరూపించుకుని,ముఖ్యంగా కండలు తిరిగిన దేహం,నటనా ప్రతిభ వంటివి మెండుగా ఉండటంతో హీరోగా ఛాన్స్ లు తెచ్చుకుని కమాండో మూవీలో హీరోగా చేయడంతో హిందీలో మంచి విజయం నమోదు చేసుకుంది.
దీనికి సీక్వెల్ గా వచ్చిన మరో మూడు చిత్రాలు కూడా ఆడియన్స్ ని అలరించాయి. ఇక ఆ మధ్య విద్యుత్ జమన్వాల్ బాలీవుడ్లో “ఖుదాఫీస్” చిత్రంలో హీరోగా నటించాడు కానీ కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడడంతో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ పామ్ లో విడుదల చేశారు.ఈ చిత్రం పర్వాలేదనిపించింది.
అయితే విద్యుత్ జమాన్వాల్ పారితోషికం విషయంలో కూడా దాదాపుగా 25 కోట్ల రూపాయలకు పైగా తీసుకుంటున్నట్లు టాక్. ఆ మధ్య విద్యుత్ జమాన్వాల్ ,తమిళ ప్రముఖ హీరో సూర్య కలిసి నటించిన సికిందర్ చిత్రం కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
విద్యుత్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే యూట్యూబ్ విద్యుత్ జమాన్వాల్ ఎప్పుడూ తన నటనా ప్రతిభ మెరుగు పరుచుకుంటూ ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు పలు వీడియోలను కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూ, తన ఫాన్స్ కి అందుబాటులో ఉంటున్నాడు. ప్రస్తుతం విద్యుత్ జమాన్వాల్ అధికారిక ఇంస్టాగ్రామ్ ని దాదాపు 57 లక్షల పైనే నెటిజన్లు ఫాలో అవుతున్నారు.