Diabetes Food:ఈ గింజలను వీటితో కలిపి తీసుకుంటే షుగర్ లెవెల్స్ ను తగ్గించి పెరగకుండా చేస్తుంది
Fenugreek seeds and black pepper Benefits :డయాబెటిస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే వస్తుంది. ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడవలసిందే. డయాబెటిస్ ని అసలు అశ్రద్ద చేయకూడదు. డయాబెటిస్ నియంత్రణకు మందులు వాడుతూ ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ప్రయోజనం ఉంటుంది.
మెంతులు డయాబెటిస్ నిర్వహణలో చాలా బాగా పనిచేస్తాయి. మెంతులను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. మెంతులను వాడటం వల్ల డయాబెటిస్ మాత్రమే కాదు, కొలెస్ట్రాల్ మరియు అధిక బరువు కూడా అదుపులో ఉంటాయి. మెంతులు ఫాస్టింగ్ షుగర్ని తగ్గిస్తుంది, గ్లూకోజ్ స్థాయిని మెరుగుపరుస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్లను కూడా తగ్గిస్తుంది.
మెంతుల నీరు మరియు మెంతి పొడి రెండూ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. రాత్రి సమయంలో ఒక బౌల్ లో అరస్పూన్ మెంతులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి…లేదంటే పావు స్పూన్ పొడిని వేడి నీటిలో కలిపి పది నిమిషాలు అయ్యాక బాగా కలిపి తాగాలి. ఈ విధంగా ఉదయ పరగడుపున తీసుకోవాలి.
నల్ల మిరియాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తాయి. నల్ల మిరియాలు ఇన్సులిన్ లోపాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతే కాకుండా, నల్ల మిరియాలు షుగర్ పెరగకుండా నిరోధిస్తుంది.నల్ల మిరియాలలో పైపెరిన్ సమృద్దిగా ఉండుట వలన డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ లో సగం మిరియాల పొడి వేసి బాగా కలిపి ఉదయం పరగడుపున తాగాలి…లేదంటే రాత్రి పడుకోవటానికి ఒక గంట ముందు తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.