Dry Fruits:నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ పరగడుపున తింటే ఎన్ని ప్రయోజనాలో…ముఖ్యంగా ఆ సమస్యలు ఉన్నవారికి
Dry Fruits Health Benefits In telugu : డ్రై సీడ్స్ లేదా డ్రై ఫ్రూట్స్ అనేవి కాస్త ధర ఎక్కువైన మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా డ్రై ఫ్రూట్స్ ని తినటం అలవాటుగా చేసుకుంటున్నారు. మనలో చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున తింటూ ఉంటారు.
వాల్ నట్స్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాల్ నట్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇవి కీలకమైన పాత్రను పోషిస్తాయి. ముఖ్యంగా, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి. రెండు వాల్ నట్స్ ని రెగ్యులర్ గా తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 10 శాతం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
బాదం మరియు వాల్నట్ల కంటే పిస్తా పప్పును నంబర్ వన్ డ్రై ఫ్రూట్‌గా నిపుణులు చెప్పుతారు. వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల 4 పిస్తా గింజలను ప్రతి రోజు తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పిస్తా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు పీచు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా దూరమవుతాయి.
నానబెట్టిన బాదం పప్పును ప్రతి రోజూ తీసుకుంటే రక్తపోటు సమస్యలతో పాటు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఒక బౌల్ లో 4 బాదం పప్పులను వేసి నీటిని పోసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు తొక్క తీసి తినాలి. బాదం పప్పు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటమే కాకుండా అధిక బరువును కూడా నియంత్రిస్తుంది.
ఎన్నో పోషకాలు ఉన్న వేరుశనగను అందరూ ఇష్టంగా తింటారు. మన శరీరానికి అవసరమైన విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి6 వంటివి సమృద్దిగా ఉంటాయి. వీటితో పాటు గుండెకు ఉపయోగపడే మంచి కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు, పొటాషియం, సోడియం, తక్కువ మోతాదులో ఉండే కార్బోహైడ్రేట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
జీడిపప్పులో ఉండే పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రోజుకి 2 లేదా 3 జీడిపప్పులను తింటే గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే జీడిపప్పును ఉప్పు మరియు నూనె లేకుండా తీసుకోవాలి. అయితే జీడిపప్పును ఎక్కువగా తింటే శరీరంలో కేలరీలను పెంచుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.