Rukshar Dhillon:నాని హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో…భవిష్యత్తు ఏమిటో పాపం…?
Telugu Heroine rukshar dhillon :నేచురల్ స్టార్ నాని హీరోగా తెలుగులో ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ తీసిన కృష్ణార్జున యుద్ధం మూవీ ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముంబై బ్యూటీ రుక్సార్ థిల్లాన్ ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయం, నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది.
దీంతో వెంటనే ఈ అమ్మడికి అల్లు హీరో అల్లు శిరీష్ హీరోగా నటించిన ఏబిసిడి (అమెరికన్ బర్న్ కన్ఫ్యూజ్ దేశి) అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదు. టాలీవుడ్ లో హిట్స్ లేకపోతె కెరీర్ దెబ్బతింటుంది. సరిగ్గా ఈమెకు కూడా అదే జరిగింది.
అయితే ఈ రెండు చిత్రాల్లో నటించిన తర్వాత హిందీలో బాంగ్రా పా లే అనే ఓ డాన్స్ తరహా చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చినా కరోనా కారణంగా పాపం పెద్దగా కలిసి రాలేదు. రుక్సార్ థిల్లాన్ కి తెలుగులో సరైన హిట్ పడితే మళ్లీ స్టార్ హీరోయిన్ గా నిలబడే ఛాన్స్ లున్నాయని కొందరి వాదన.
రుక్సార్ థిల్లాన్ ఇటీవలే నా సామిరంగ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. అందం,అభినయం,టాలెంట్ తో పాటు ఒకింత అదృష్టం కూడా ఉండాలి మరి..