Akshaya tritiya 2024:మే 10 అక్షయ తృతీయ రోజు ఈ రాశుల వారు మర్చిపోకుండా ఇలా చేస్తే సిరి సంపదలకు లోటు ఉండదు
Akshaya tritiya 2024:అక్షయ తృతీయ అనేది హిందువులు ఆచరించే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ. హిందూ సంప్రదాయం ప్రకారం అక్షయ తృతీయ వైశాఖ మాసంలో మూడో రోజున వస్తుంది. ఈ సంవత్సరం 2024 లో అక్షయ తృతీయ మే 10 న వచ్చింది.
సంస్కృతములో అక్షయ అంటే నాశనం లేనిది లేదా అనంతం అని అర్ధం. అక్షయ తృతీయ రోజు ఏ పని చేసిన విజయం సిద్ధిస్తుందని మన పెద్దలు చెప్పు తున్నారు. అక్షయ తృతీయ రోజు అందరు ఎంతో కొంత బంగారం కొంటూ ఉంటారు.
బంగారం కొనటానికి ధనిక,పేద అనే తేడా ఉండదు. ఎవరి తాహతుకు తగ్గట్టుగా బంగారాన్ని కొంటూ ఉంటారు. ఇలా కొంటె ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. మే 10 అక్షయ తృతీయ రోజు ఈ రాశుల వారు ఇలా చేస్తే జీవితంలో ఎలాంటి బాధలు,కష్టాలు లేకుండా సిరి సంపదలతో ఉంటారని పెద్దలు చెప్పుతూ ఉంటారు. ఇప్పుడు ఆ రాశుల వారు ఎవరో ఏమి చేస్తే అదృష్టం వస్తుందో వివరంగా తెలుసుకుందాం.
మే 10 అక్షయ తృతీయ రోజు వృషభ రాశివారికి రోహిణి నక్షత్రం ఉచ్చ స్థానంలో ఉంది. రోహిణి నక్షత్రం అంటే మనః కారక గ్రాహం అని అర్ధం. మనస్సును అదుపులో ఉంచే గ్రహంగా చంద్రుడు చెప్పబడుతున్నాడు. ఈ రాశి వారికీ చంద్ర మండల యోగం కనపడుతుంది. రవి,శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉండుట వలన వృషభ రాశి వారికి మంచి జరుగుతుంది. ఆ రోజు లక్ష్మి పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.
మేష రాశి వారు వినాయక,సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం మంచిది. ఆ రోజున పాయసం దానం చేస్తే సిరి సంపదలు కలుగుతాయి. అలాగే సుఖ శాంతులు కూడా లభిస్తాయి.
వృషభ రాశిలో జన్మించినవారు అంబికా దేవిని పూజించి చక్కర పొంగలి లేదా రవ్వ లడ్డు నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
మిధున రాశి లో జన్మించినవారు విష్ణు,మహాలక్ష్మిలను అస్తోత్రాలతో పూజించి మీకు చేతనైన సాయాన్ని ఇతరులకు చేస్తే మీకు ఆర్ధికంగా బాగుంటుంది.
కర్కాటక రాశిలో జన్మించిన వారు దుర్గా దేవిని పూజించి నేతితో దీపాన్ని పెట్టి బియ్యంపిండితో తయారుచేసిన పదార్ధాలను దానం చేస్తే అనుకున్న పనులు త్వరగా జరుగుతాయి
సింహ రాశిలో పుట్టినవారు పరమ శివుణ్ణి పూజించాలి
కన్య రాశిలో జన్మించిన వారు లక్ష్మి నారాయణులను పూజించాలి.
తులా రాశిలో పుట్టిన వారు దుర్గా దేవిని పూజించాలి.
వృశ్చిక రాశివారు వినాయకుణ్ణి పూజించాలి.
ధనస్సు రాశివారు దక్షిణ మూర్తిని పూజించాలి.
మకర రాశివారు హనుమంతుణ్ణి పూజించాలి.
కుంభ రాశివారు శనీశ్వరుణ్ణి,హనుమంతుణ్ణి పూజించాలి.
మీనా రాశివారు నందీశ్వరుని పూజించాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.