Honey For Pimples:తేనేతో ఇలా చేస్తే ముఖం మీద జిడ్డు,మొటిమలు అన్నీ మాయం
Honey For Pimples: ముఖం మీద మొటిమలు,జిడ్డు లేకుండా ఉంటే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఈ సమస్యలతో మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల నుండి బయట పడటానికి తేనే చాలా బాగా సహాయపడుతుంది.
తేనె గొప్ప మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మాన్ని బాగా తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లను దూరం చేయడంతో పాటు ముఖం మీద నల్లని మచ్చలు మరియు మొటిమలను కూడా తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
అంతేకాకుండా తేనేలో బ్లీచింగ్ గుణాలు సమృద్దిగా ఉండుట వలన పిగ్మెంటేషన్ మరియు మచ్చలను తొలగించటంలో సహాయపడుతుంది. ముఖం మీద తేనేను రాసి సున్నితంగా మసాజ్ చేసి 5 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం మీద ఎటువంటి సమస్యలు లేకుండా తెల్లగా మెరుస్తుంది. అయితే తేనే ఆర్గానిక్ తేనే వాడితే మంచిది. బయట మార్కెట్ లో దొరికే తేనే కల్తీ జరిగే అవకాశం ఉంది.
ముఖ సంరక్షణలో తేనే చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. మన వంటింటిలో ఉన్న పదార్ధాలను జాగ్రత్తగా ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి శ్రద్ద సమయాన్ని కేటాయిస్తే చాలా తక్కువ ఖర్చులో ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.