Rangasthalam Movie:రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో…?
Rangasthalam Movie :సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో అనసూయ రంగమ్మత్త అనే పాత్రలో నటించింది.
ఈ పాత్ర అనసూయకు మంచి క్రేజ్ ని తెచ్చి పెట్టింది. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. రంగస్థలం సినిమా తర్వాత అనసూయ క్రేజ్ బాగా పెరిగింది. వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.
అయితే రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర కోసం ముందుగా ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన రాశిని సంప్రదించారట. అయితే ఆమెకు వస్త్రధారణ నచ్చక నో చెప్పిందని సమాచారం. హీరోయిన్ రాశికి అవకాశాలు తగ్గటంతో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సక్సెస్ గా ముందుకు సాగుతున్నారు.