Guppedantha manasu serial:గుప్పెడంత మనసు సీరియల్ నటి వసుధార రియల్ లైఫ్…
Guppedantha manasu serial vasundhara : ప్రముఖ టివి ఛానల్ లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మొదటి నుంచి మంచి రేటింగ్ తో పాపులర్ సీరియల్ గా రాణిస్తోంది. ఇందులో నటీనటులకు కూడా ఆడియన్స్ నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అందరూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. అందరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇందులో వసుధార పాత్రలో నటిస్తున్న రక్షా గౌడ్ కూడా తన నటనతో అలరిస్తోంది.
ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తూ తన అందంతో,అభినయంతో ఆడియన్స్ మనసు దోచుకున్న రక్షా గౌడ బెంగుళూరులోనే పుట్టి పెరిగింది. ఫిబ్రవరి 17న పుట్టిన ఈమె స్టడీస్ బెంగుళూరులోనే పూర్తిచేసింది. చిన్నప్పటినుంచి నటనపై ఉన్న ఆసక్తితో మోడలింగ్ తో కెరీర్ స్టార్ట్ చేసింది. బిబిఎ చదువుండగా, రాధారమణ అనే కన్నడ సీరియల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఫుట్ మాలీ అనే కన్నడ సీరియల్ లో కూడా నటించి కన్నడ ఆడియన్స్ కి దగ్గరైంది. కేవలం రెండు సీరియల్స్ తోనే కన్నడ ప్రేక్షకుల మనసు దోచుకున్న రక్షా స్టార్ మా ఛానల్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ తో కల్సి కృష్ణవేణి సీరియల్ లో నటించి తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ లో తెలుగు ఆడియన్స్ నుంచి అభిమానం పొందిన ఈమె ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తూ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు సంపాదించింది. తన అభిమాన సినీ నటుడు కార్తికేయతో కల్సి నటించాలని ఆకాంక్షిస్తోంది.