Sompu:భోజనం తర్వాత అర స్పూన్ నోట్లో వేసుకుంటే గ్యాస్ సమస్య,నోటి దుర్వాసన అనేవి అసలు ఉండవు
Sompu Health Benefits in telugu :ఈ రోజుల్లో మనలో చాలా మంది గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు గ్యాస్ సమస్య తగ్గించడానికి ఒక మంచి ఇంటి చిట్కా తెలుసుకుందాం. ఈ చిట్కా కోసం కేవలం సొంపును మాత్రమే ఉపయోగిస్తున్నాం.సొంపు చూడటానికి జీలకర్ర వలె ఉంటుంది.
సోంపులో తీయని ఫ్లెవర్ ఉండటం వలన మధురిమ అని కూడా పిలుస్తారు సోంపును ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. సోంపు గింజల్లో రాగి, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఇనుము, సెలెలియం, మాంగనీస్ మరియు క్యాల్షియం వంటి ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. సోంపును చాలామంది భోజనం అయ్యాక నములుతూ ఉంటారు.
శరీరంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అయినప్పుడు గొంతులో మంట కడుపులో మంట వస్తాయి. సోంపు లో ఉండే ఎనితాల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తిని తగ్గించి సమస్యలు లేకుండా చేస్తుంది అంతేకాకుండా శరీరానికి అవసరమైన మంచి ఎంజైమ్స్ ని ఉత్పత్తి చేస్తుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
సోంపు లో ఉండే ఒక రసాయనిక పదార్థం శారీరక రక్షక వ్యవస్థను మెరుగుపరుస్తుంది దాంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. గ్యాస్ సమస్య ఉన్నవారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయ్యాక ఒకసారి రాత్రి భోజనం తర్వాత ఒకసారి అరస్పూన్ సోంపు నమిలి మింగితే సరిపోతుంది. అలాగే సోంపు తినటం వలన నోటి దుర్వాసన మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఉండవు.
సోంపు గింజలను నమలడం వల్ల లాలాజలములో నైట్రైట్ శాతం పెరిగి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. బరువు తగ్గటానికి కూడా బాగా సహాయపడుతుంది. కాబట్టి అరస్పూన్ సొంపు తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.