NTR:యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
Young Tiger NTR:యంగ్ టైగర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాత వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తారాజువ్వలా ఎదిగాడు. బాలనటుడిగా కొన్ని సినిమాలు చేసిన ‘నిన్ను చూడాలని’ అంటూ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపుతూ ముందుకు దూసుకువెళ్ళుతున్నాడు యంగ్ టైగర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్టీఆర్ మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ సినిమాకు పారితోషికం మూడున్నర లక్షలు తీసుకున్నాడు. ఆ మొత్తం డబ్బును తల్లి షాలిని చేతిలో పెట్టేసాడు.
ఎన్టీఆర్ కి పుస్తకాలు చదవటం కన్నా వినటమే ఎక్కువ ఇష్టం.
యంగ్ టైగర్ లక్కీ నెంబర్ 9. అందుకే ఎన్టీఆర్ కారు నెంబర్ లో అన్ని 9 అంకెలే కనపడతాయి.
ఎన్టీఆర్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. మంచి బ్యాట్ మాన్. కాస్త విరామం దొరికిన క్రికెట్ ఆడుతూ ఉంటాడు.
మొదటి నుంచి వంటలో తల్లికి సాయం చేయటంతో ఎన్టీఆర్ మంచి కుక్ అని చెప్పవచ్చు. బిర్యానీ వండటంలో దిట్ట.
ఎన్టీఆర్ కి తల్లి చేసే రొయ్యల బిర్యానీ అంటే చాలా ఇష్టం. నెలకు ఒక్కసారైనా తినాల్సిందే.
ఎన్టీఆర్ కి వాచ్ లను సేకరించే హాబీ ఉంది. ఎన్టీఆర్ దగ్గర ఉన్న వాచ్ లను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ఎన్టీఆర్ కి బాగా నచ్చిన సినిమా ‘దాన వీర శూర కర్ణ’. ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుందట.
తాను నటించిన సినిమాల్లో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా మనస్సుకు దగ్గరైన సినిమా.
అభిమాన హీరో తాతయ్య నందమూరి తారక రామారావు గారు,అభిమాన హీరోయిన్ శ్రీదేవి.
ఎన్టీఆర్ కు ..‘మాతృదేవోభవ’ సినిమాలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే చాలా ఇష్టం. ఆ పాటని కీరవాణి ఎన్టీఆర్కి అంకితం ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఎన్టీఆర్ ఆధ్యాత్మిక గురువు పేరు జగ్గివాసుదేవ్.
ఎన్టీఆర్ కి మొదటి నుంచి తనతో పనిచేసిన దర్సకులకు గిఫ్ట్స్ ఇవ్వటం అలవాటు.
మార్చి 26… ఎన్టీఆర్ మర్చిపోలేని రోజు. 2009 మార్చి 26న ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురయ్యారు. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు కూడా అదే రోజు.
మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ కథ మొదటగా ఎన్టీఆర్ దగ్గ్గరకే వచ్చింది. కథ నచ్చక ఎన్టీఆర్ రిజెక్ట్ చేసాడు.