New Cloths :పురాణాల ప్రకారం కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటే ఏమౌతుందో తెలుసా?
New Cloths:పండగ వచ్చినా, పుట్టినరోజు వచ్చినా కొత్త బట్టలు కుట్టించుకోవడం మనలో చాలా మందికి అలవాటు. మామూలు రోజుల్లో కూడా కొత్త బట్టలు వేసుకోవాలని ఇష్టపడతారు చాలామంది. కొత్త బట్టలు ఉన్న దగ్గర నుంచి వాటిని ఎప్పుడు వేసుకుందామా అని చాలా ఆశక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.
అయితే కొత్త బట్టలు వేసుకునే ముందు మనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త బట్టలు వేసుకునే ముందు ఒకసారి వాటిని ఉతకాలట. ఇది మనకు పురాణాలలో చెప్పినా కూడా దీని వెనుక సైన్స్ దాగి ఉందట.
కొత్త బట్టలు ముడతలు పడకుండా, అట్రాక్ట్ గా ఉండటం కోసం వాటికి కెమికల్స్ యూజ్ చేస్తారు. వాటి వలన మనకు అలర్జీ, దురదలు వచ్చే అవకాశం ఉంది.
ఇప్పుడు బట్టలు కొనేముందు ట్రైల్ వేసుకుని చూడటం అలవాటుగా మారింది. అలా ఎవరో వేసుకున్నవి వేసుకోవడం వలన కూడా స్కిన్ సమస్యలు వస్తాయి.
అందుకే మన పూర్వీకులు కొత్త బట్టలు వేసుకునే ముందు వాటిని ఉతికి అప్పుడు వేసుకోమనేవారు. ఎందుకంటే వెనుకటికీ అలా కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకునే వారు అనారోగ్యానికి గురి అయ్యేవారట.
ఇంకా మన పూర్వీకులు శుక్రవారం బట్టలు కొంటె మంచిదని చెప్పారు. శనివారం అస్సలు కొనుగోలు చేయకూడదంట.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.