Kesar Badam Milk:కుంకుమపువ్వు, బాదంపప్పు కలిపిన పాలు తాగితే…ముఖ్యంగా ఈ సమస్య ఉన్నవారు…
Kesar Badam Milk Health benefits In telugu : కుంకుమపువ్వు,బాదం పాలు కాస్త ధర ఎక్కువైన ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పాలను అన్నీ వయస్సుల వారు తాగవచ్చు. ఈ పాలను తయారుచేసుకోవటం కూడా చాలా సులభం. గర్భిణీ స్త్రీలు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని తాగితే మంచిదని చెప్పుతు ఉంటారు.
గర్భిణీ స్త్రీలు కుంకుమపువ్వు మరియు బాదంపప్పు కలిపిన పాలు తాగితే శరీరానికి శక్తినిచ్చి, మనస్సును సమతుల్యం చేసి, బలహీనతను దూరం చేస్తుంది. రాత్రి సమయంలో ఒక బౌల్ లో 4 బాదం పప్పులను వేసి నీటిని పోసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం బాదం పప్పు తొక్కలు తీసేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోసి రెండు కుంకుమ పువ్వు రేకలు, బాదం పప్పు పేస్ట్ వేసి 5 నిమిషాల పాటు మరిగించి…వేడిగా ఉన్నప్పుడే తాగాలి. కుంకుమపువ్వులో క్రోసిన్, సఫ్రానాల్ మరియు పిక్రోక్రోసిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి నిద్రలేమి సమస్యకు,డిప్రెషన్ చికిత్సకు సహాయపడతాయి.
ఈ పాలల్లో ఉండే మాంగనీస్ నిద్రను ప్రేరేపిస్తుంది. ఈ పాలల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన పిరియడ్స్ సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. బాదం మరియు కుంకుమపువ్వు రెండింటిలోను శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మ సమస్యలను తగ్గిస్తాయి.
చర్మం మీద ముడతలు, వృద్ధాప్య ప్రారంభ సంకేతాలను తగ్గించడానికి, పొడిబారడం, హైపర్‌పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. సీజనల్ గా వచ్చే దగ్గు,జలుబు,గొంతు ఇన్ ఫెక్షన్ వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలర్జీ సమస్యలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.