Devotional

Facts About Superstitions: మూడ నమ్మకాల వెనుక దాగి ఉన్న నిజాలు…అసలు నమ్మలేరు

Nammakalu Mudanammakalu :ప్రతీ ఒక్కరు వారి జీవితంలో ఏదో ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మేసి దాన్ని ఫాలో అయిపోతారు. కేవలం వారే కాకుండా ఇతరులకు కూడా ఈ విషయాన్ని చెప్పి వారిని కూడా అలాగే చేయమని చెబుతారు. వీటినే మూడ నమ్మకాలూ అంటారు.

రాత్రి వేళల్లో గోర్లు, జుట్టు కత్తిరించవద్దని… సాయంత్రం 6 దాటాక ఇల్లు ఊడ్చవద్దని… ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తుంటే పెరుగులో పంచదార వేసుకుని తింటే శుభం జరుగుతుందని… ఇలా ఎన్నో మూఢ నమ్మకాలను పాటిస్తూ ఉంటారు. ఇలా కొన్ని మూడ నమ్మకాల వెనుక దాగి ఉన్న నిజాల గురించి తెలుసుకుందాం.

రాత్రి వేళల్లో గోర్లు, జుట్టు కత్తిరించరాదు
రాత్రి పూట గోర్లను, జుట్టును కత్తిరిస్తే దుష్ట శక్తులు ఆవహిస్తాయని కొందరు నమ్ముతారు. కాని నిజానికి పూర్వ కాలంలో నేల్ కట్టర్ ఉండేవి కాదు కాబట్టి, పదునుగా ఉన్న కత్తులతో గొర్లను కత్తిరించుకునేవారు. పొద్దంతా పనులు చేసుకొని రాత్రి ఇంటికి వచ్చినప్పుడు కరెంటు ఉండేది కాదు కాబట్టి.. చీకట్లో గోర్లు కత్తిరించునేటప్పుడు అప్పుడప్పుడు వెళ్ళు తెగేవట. అందుకే అప్పటి నుండి రాత్రి వేళల్లో గోర్లు, జుట్టు కత్తిరించవద్దని అంటారు.

సాయంత్రం 6 దాటాక ఇల్లు ఊడ్చవద్దు
ఈ మూఢ నమ్మకానికి కూడా కరెంటు తో సంబంధం ఉంది. దీపం వెలుగులో ఇల్లు ఊడిస్తే సరిగ్గా కనపడదు కాబట్టి.. ఏవైనా విలువైన వస్తువులు కూడా ఊడ్చి పారేస్తారేమో అని ఈ అలవాటు చేసుకున్నారు.

బయటకు వెళ్తుంటే పెరుగులో పంచదార వేసుకుని తింటే శుభం జరుగుతుంది
పెరుగు, పంచదార మిశ్రమం చలవ చేస్తుంది. అందువల్ల బయటకు వెళ్లేముందు ఇది తింటే కడుపును చల్లగా ఉంచుతుంది. దీని వల్ల గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది.

రాత్రి పూట రావి చెట్టు కింద నిద్రపోకూడదు
రావి చెట్టు కింద రాత్రి పడుకుంటే చనిపోతారు అంటారు. సాధారణంగా చెట్లు కార్బన్-డయాక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. రాగి చెట్టు పొద్దున ఇలా చేసినా రాత్రి పూట మాత్రం ఆక్సిజన్ ను పీలుచుకొని కార్బన్-డయాక్సైడ్ ను విడుదల చేస్తాయి. అందువల్ల రాత్రి ఈ చెట్టు కింద పడుకుంటే అధిక శాతం కార్బన్-డయాక్సైడ్ పీల్చుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

అంత్యక్రియలకు వెళ్లి వస్తే స్నానం చేయాలి
అంత్యక్రియల నుండి వచ్చినప్పుడు తప్పకుండా స్నానం చేయమని అంటారు. ఎందుకంటే ఆత్మలు, దుష్ట శక్తులు మీ వెంట వస్తాయని. కాని నిజానికి ఇలా చేయడానికి కారణం… మృతదేహం నుండి వ్యాపించే బ్యాక్టీరియాను తొలగించడానికి స్నానాలు చెయ్యాలి.

తులసి ఆకుని నమలకుండా మింగేయాలి
తులసి ఆకుని నమిలితే.. బయట గాలి తగిలి అందులోని ఔషధ గుణాలు కోల్పోతుంది. అదే మింగేస్తే.. గాలి తగలకుండా సరాసరి మన జీర్ణ వ్యవస్థ కు చేరుకొని శరీరానికి మంచి చేస్తుంది.

ఉత్తర వైపు తల పెట్టి నిద్రపోకూడదు
నిజానికి ఉత్తర వైపు తల పెట్టి నిద్రపోతే.. భూమి యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి.

గ్రహణం జరిగేటప్పుడు బయటకు వెళ్ళకూడదు
గ్రహణం జరిగేటప్పుడు అందరికి చూడాలని ఉంటుంది. గ్రహణం ఎలా జరుగుతుంది అన్న కుతూహలంలో సూర్యుడిని అలాగే చూస్తే కంటి చూపు దెబ్బతింటుంది. ఒక్కోసారి కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.