Kitchenvantalu

Fruits Colour Change:ఇలా చేస్తే.. కట్ చేసిన పండ్లు రంగు మారవు!

Fruits Colour Change:సాదారణంగా కొన్ని పండ్లు కోసినప్పుడు రంగు మారుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. పండ్లు కోసినప్పుడు ఆక్సిడేషన్ ప్రక్రియ కారణంగా రంగు మారుతూ ఉంటాయి.

నీటి మధ్యలో పండ్లను ఉంచి కోసినట్లయితే ఆక్సిడేషన్ ప్రక్రియను ఆపవచ్చు. దీనివల్ల పండ్లు బ్రౌన్ రంగులోకి మారకుండా తాజాగా కనిపిస్తాయి. కట్ చేసిన పండ్ల ముక్కలను అల్లం ద్రావణం (జింజర్ అలే)లో వేస్తే రంగు మారకుండా ఉంటాయి.

అల్లంలో ఉండే సెట్రిక్ యాసిడ్ ఆక్సిడేషన్ ప్రక్రియను నిలిపివేస్తుంది. ఒక బౌల్ లో కొంచెం ఉప్పు వేసి పండ్ల ముక్కలను వేసి బాగా కలిపి ఒక నిమిషం అయ్యాక నీటితో శుభ్రం చేస్తే రంగు మారకుండా ఉంటాయి.

గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి కలపండి. అందులో పండ్ల ముక్కలను వేసి.. 30 సెకన్ల తర్వాత బయటకు తీయండి. ఇలా చేస్తే సుమారు 8 గంటల వరకు పండ్లు ముక్కలు రంగు మారకుండా తాజాగా కనిపిస్తాయి.

ఒక బౌల్ లో నీటిని పోసి ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి దానిలో పండ్ల ముక్కలను వేసి తీసినట్లయితే రంగు మారకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. నిమ్మ రసం అందుబాటులో లేకపోతే పైనాపిల్ లేదా ఆరెంజ్ జ్యూస్‌ వాడవచ్చు. దానిలో కూడా సెట్రస్ ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.