Cashew with honey:జీడిపప్పును తేనెలో నానబెట్టి తింటున్నారా..అయితే ఈ విషయం తెలుసా…?
Cashew nuts with honey Health Benefits In telugu : మారిన పరిస్థితి కారణంగా దాదాపుగా అందరూ ఆరోగ్యం మీద శ్రద్ద పెడుతున్నారు. దాంతో Dry Fruits వాడకం కూడా చాలా ఎక్కువ అయింది. జీడిపప్పును మనలో చాలా మంది వేగించుకొని లేదా పంచదార లేదా బెల్లం పాకం పట్టుకొని తింటూ ఉంటారు. అలా కాకుండా జీడిపప్పును తేనెలో నానబెట్టి తింటే రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు.
జీడిపప్పు, తేనె ఈ రెండింటిలోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రెండింటిలోనూ ఎన్నో పోషకాలు ఉన్నాయి.ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఎక్ప్రకువ యోజనాలు కలుగుతాయి. తేనె వాడినప్పుడు ఆర్గానిక్ తేనె అయితే మంచిది. తేనెలో జీడిపప్పును వేసి నానబెట్టాలి. ఉదయం పరగడుపున తింటే మంచి పలితాలను పొందవచ్చు.
జీడిపప్పు విషయానికొస్తే కాల్షియం,మెగ్నీషియం,పొటాషియం,జింక్,ఐరన్ ప్రోటీన్స్ సోడియం విటమిన్ సి విటమిన్ బి విటమిన్ కె యాంటీఆక్సిడెంట్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇక తేనే విషయానికొస్తే ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నాలుగు జీడిపప్పులను తేనెలో గంటసేపు నానబెట్టి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు.కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారికి కూడా మంచి ప్రయోజనం కనబడుతుంది చదువుకునే పిల్లలు తేనెలో నానబెట్టిన జీడిపప్పులు తింటే మెదడు చురుగ్గా పని చేసి జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.
రక్తపోటు నియంత్రణలో ఉండి రక్తప్రసరణ బాగా సాగేలా చేయటమే కాకుండా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో సహాయపడి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి తేనెలో నానబెట్టిన జీడిపప్పును తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తేనెలో నానబెట్టిన జీడిపప్పును అన్ని వయస్సులవారు తీసుకోవచ్చు.మోతాదు మించకుండా తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.