Healthhealth tips in telugu

Guava Leaves:జామకాయలతో పాటు జామ ఆకులలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

Guava Leaves Health benefits:మెక్సికో మరియు అమెరికా దేశాలలోని వివిధ ప్రాంతాలలో పుట్టిన జామ పండులోఅనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మనలో చాలా మందికి జామ పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసు. కానీ జామ ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు.జామ ఆకులో ఉండే లక్షణాలు కారణంగా అనేక సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. మనకు తెలియని,జామ ఆకు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.
Guava leaves good for dengue In Telugu
క్యాన్సర్
జామ ఆకు రసాన్ని తగిన మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది. జామ ఆకులో విటమిన్ సి, లైకోపీన్, పాలీ-ఫినాల్స్ వంటి సహజ రసాయన సమ్మేళనాలు ఉండుట వలన క్యాన్సర్ కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. అంతేకాక జామ ఆకులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్ పెరుగుదలను అరికట్టి పెద్దప్రేగులో విష ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఆహారం ద్వారా వచ్చే కొవ్వు నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

డెంగ్యూ చికిత్స
జామ ఆకు రసాన్ని జ్వరం నివారణకు సహజమైన ఇంటి నివారణగా ఉపయోగిస్తారు. జామ ఆకులను ఉడికించి తయారుచేసిన రసంను రోజుకి మూడు సార్లు త్రాగితే డెంగ్యూ జ్వరం తగ్గుతుంది. ఈ విధంగా త్రాగితే రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య కూడా త్వరగా పెరుగుతుంది.
eye sight remedies
దృష్టి(విజన్) మెరుగుదల
మన దృష్టి(విజన్) బాగుండాలంటే విటమిన్ A అవసరం. ఈ జామ ఆకుల్లో విటమిన్ A సమృద్దిగా ఉంటుంది. అందువలన ప్రతి రోజు జామ ఆకు రసాన్ని త్రాగితే దృష్టి మెరుగు అవుతుంది. అంతేకాక కంటిశుక్లం మరియు దృష్టి లోపాలను తగ్గించటంలో సహాయపడుతుంది.
gas troble home remedies
జీర్ణక్రియలో మెరుగుదల
జామ ఆకు రసం జీర్ణాశయంలో జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రోత్సహించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జామ ఆకులో ఉండే యాంటి బాక్టీరియల్ ఏజెంట్లు జీర్ణాశయ పొరల్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాలను క్రియరహితంగా మార్చేస్తాయి. జామ ఆకు రసాన్ని ప్రతి రోజు మూడు సార్లు త్రాగితేకడుపునొప్పి తగ్గుతుంది.
Acidity home remedies
అతిసారం మరియు విరేచనాలు
అతిసారం మరియు విరేచనాలను తగ్గించటంలో జామ ఆకు చాలా బాగా పనిచేస్తుంది. రెండు గ్లాసుల నీటిలో గుప్పెడు బియ్యం పిండి, జామ ఆకులను వేసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని రోజులో రెండు సార్లు తీసుకుంటే అతిసారం తగ్గుతుంది. విరేచనాలు తగ్గటానికి జామ ఆకులు మరియు జామ వేర్లు నీటిలో వేసి మరిగించి కాషాయం తయారుచేయాలి. ఈ కషాయాన్ని విరేచనాలు తగ్గే వరకు త్రాగాలి.
Weight Loss tips in telugu
బరువు తగ్గటానికి
జామ టీ అనేది శరీరంలో అనవసరమైన కొవ్వును తొలగించుకోవటానికి అత్యంత ప్రభావవంతముగా పనిచేస్తుంది. జామ ఆకులు పిండి పదార్దాలను చక్కెరలుగా మారకుండా నివారించటం ద్వారా బరువు తగ్గేలా ప్రేరేపిస్తుంది.
Diabetes diet in telugu
డయాబెటిస్
జపాన్ లోని “యకుల్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్” వారు జామ ఆకు టీ మీద పరిశోదన జరిపారు. మధుమేహ వ్యాధి గ్రస్తులు నాలుగు నెలల పాటు జామ ఆకు టీని త్రాగటం వలన శరీరంలో ఆల్ఫా-గ్లూకోసైడేజ్ ఎంజైమ్స్ చైతన్యం తగ్గి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయి. అంతేకాక శరీరం సుక్రోజ్ కూడా తగ్గటం వలన ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఈ పరిశోదనపలితంగా మధుమేహం చికిత్సలో జామ ఆకు టీ సమర్ధవంతగా పనిచేస్తుందని తేలింది.
cholesterol
కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది
జామ ఆకు టీ ఒక సహజ కాలేయ టానిక్ గా పనిచేస్తుంది. శరీరంలో అవసరంలేని కొలెస్ట్రాల్ ని తగ్గించి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. జామ ఆకుల టీని 12 వారాల పాటు క్రమం తప్పకుండా త్రాగితే చెడు కొలస్ట్రాల్ LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) మరియు ట్రైగ్లిజెరైడ్స్ తగ్గి HDL (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది.
Thyroid remedies
థైరాయిడ్ పనితీరులో మెరుగుదల
థైరాయిడ్ గ్రంధి థైరాయిడ్ పనితీరును క్రమబద్దీకరణ చేస్తుంది. జామ ఆకులో రాగి ఎక్కువ మొత్తంలో ఉండుట వలన శరీరం మొత్తం హార్మోన్ల విడుదలలో నియంత్రణ కలిగి ఉంటుంది.
jama aaku
జామ ఆకుల్లో పీచు పదార్థం అధిక మొత్తంలో ఉండుట వలన మలబద్దకం సమస్య వచ్చినప్పుడు మంచి విరేచనకారిగా పనిచేస్తుంది. కోతలు,ఒరిపిడి వంటి గాయాల మీద జామ ఆకు పేస్ట్ రాస్తే తొందరగా నయం అవుతాయి. జామ ఆకులో యాంటి బ్యాక్టిరియాల్ లక్షణాలు ఉండుట వలన ఇన్ ఫెక్షన్ మరియు గర్భాశయం మంట మొదలైనవి త్వరగా నయం అవుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.