Dondakaya:దొండకాయలు తింటే…99 శాతం మందికి తెలియని నమ్మలేని నిజాలు
Dondakaya Benefits in telugu : మనం రెగ్యులర్ గా దొండకాయను వాడుతూ ఉంటాం. దొండకాయతో కూర,వేపుడు చేసుకుంటూ ఉంటాం,చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ దొండకాయ వేపుడు తింటూ ఉంటారు. కొంతమంది దొండకాయతో ఆవకాయ పెట్టుకుంటూ ఉంటారు.
దొండకాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఆ విషయం .మనలో చాలా మందికి తెలియదు. కొంతమంది దొండకాయ తినడానికి ఇష్టపడరు అయితే ఇప్పుడు చెప్పే విషయాలు తెలుసుకుంటే తప్పనిసరిగా తినటం అలవాటు చేసుకుంటారు. కనీసం వారంలో రెండు సార్లు దొండకాయ తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
దొండకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ తటస్థీకరణ చేసి మాలిక్యులర్ స్థాయిలో కణాలకు నష్టం జరగకుండా కాపాడుతుంది. ఫైబర్, విటమిన్ బి,ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా రక్త ప్రవాహం బాగా జరిగి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
కొంతమంది దొండకాయలు పచ్చిగా తింటూ ఉంటారు అలా కూడా తినవచ్చు మన శరీరంలో ఎక్కువ పోషకాలు చేరతాయి. కాబట్టి దొండకాయను మీకు వీలైన పద్ధతిలో తీసుకుని దానిలో ఉన్న ప్రయోజనాలను పొందండి దొండకాయలు దాదాపుగా సంవత్సరం పొడవునా లభిస్తాయి. ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది కాబట్టి దొండకాయలను తిని వాటిలోని ప్రయోజనాలను పొందండి.
మనలో చాలా మంది దొండకాయ తింటే జ్ఞాపకశక్తి తగ్గుతుంది అని తినడం మానేస్తుంటారు. కానీ అది తప్పు..జ్ఞాపక శక్తి తగ్గటం అనేది ఉండదు కాబట్టి ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా దొండకాయ తినండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.