Instant Soft Idli Recipe : పప్పు నానబెట్టే పనిలేకుండా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా మెత్తని ఇడ్లీలను ఇలా చేసుకోవచ్చు..!
Instant Idli:సాధారణంగా ఇడ్లీ చేయాలంటే,ప్రిపరేషన్ ముందు రోజు నుంచి,మొదలు పెట్టాలి. అలా కాకుండా, ఇన్ స్టెంట్ గా, తినాలి అంటే ఇలా చేసేసుకోండి.
కావాల్సిన పదార్ధాలు
రవ్వ – 1 కప్పు
మందపాటి అటుకులు – 1కప్పు
పెరుగు – 1 కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
వంట సోడా – 1/2టీ స్పూన్
నీళ్లు – 1/2కప్పు
తయారీ విధానం
1.అటుకులు కడిగి, అరగంట పాటు నానపెట్టుకోవాలి.
2.పెరుగులో సోడా వేసి, పొంగనివ్వాలి.
3. పొంగిన పెరుగులో, రవ్వ వేసి, బాగా బీట్ చేసి, అరగంట పాటు, ఊరనివ్వాలి.
4.నానిన అటుకులలో, కొద్దిగా నీళ్లు చేసి, మెత్తని పెస్ట్ చేసుకుని, రవ్వలో వేసుకోవాలి.
5. అందులోకి ఉప్పు వేసి, బాగా బీట్ చేసుకోవాలి.
6. కలుపుకున్న పిండిని, ఇడ్లీ పాత్రలోకి వేసి, హై ఫ్లేమ్ పై 5 నిముషాలు, లో ఫ్లేమ్ పై 3 నిముషాలు స్టీమ్ చేసుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
7. 5 నిముషాలు అలా వదిలేసి, ఇడ్లీలు సెర్వ్ చేసుకోవడమే.