Kitchenvantalu

Protein Dosa Recipe:బ్రేక్‌ ఫాస్ట్‌లో ఈ ప్రోటీన్ దోసె తింటే రోజంతా ఉల్లాస‌మే..

Protein Dosa Recipe: ఎంత తిన్నాం అన్నది కాదు..ఎన్ని పోషకాలు తీసుకున్నాం ,ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకున్నాం అన్నది ముఖ్యం. మల్టీ గ్రేన్స్ తో, మసాల పొడితో ప్రోటీన్ దోశ ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్ధాలు
అడై కోసం..
ముడి పెసలు – ¼ కప్పు
అలసందలు – ¼ కప్పు
మినపప్పు – ¼ కప్పు
ముడి శనగలు – ¼ కప్పు
బియ్యం – 1 కప్పు
పచ్చి కొబ్బరి – 1/.4 కప్పు
పచ్చిమిర్చి – 3
ఉప్పు – తగినంత
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి – 10
నూనె – దోశ కాల్చడానికి

అడై పొడి కోసం..
పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్
మినపప్పు -1 టేబుల్ స్పూన్
నువ్వులు – 2 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 10
కరివేపాకు – 2 రెమ్మలు
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి – 5-6 రెబ్బలు
ఉప్పు – తగినంత

తయారీ విధానం
1.ఆడై కోసం ఉంచిన పప్పులన్ని రాత్రంత నానబెట్టుకోవాలి.
2.మరుసటి రోజు పప్పులతో పాటు అడై కోసం ఉంచిన అన్ని పదార్ధాలను వేసి కొంచెం రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి.
3.గ్రైండ్ చేసుకున్న అడై పిండిలో కొంచెం ఉప్పు,తగినన్ని నీళ్లు పోసి కాస్త చిక్కగా పిండి కలుపుకోవాలి.
4.పొడి కోసం ఉంచిన పదార్ధాలన్ని ఒక్కొటిగా వేసి ఎర్రగా వేపి పూర్తిగా చల్లారిన తరువాత మాత్రమే మెత్తని పొడి చేసుకోవాలి.

5.పెనంతో బాగా వేడి చేసి పెద్ద గరిటెడు పిండి పోసి కాస్త మందంగా దోశ మాదరిగా స్ప్రెడ్ చేసుకోవాలి.
6.కాలుతున్న దోశ పై అంచులకు నూనె వేసి పైన తయారు చేసుకున్న పొడి చల్లుకోవాలి.
7.ఒక వైపు కాలిన దోశను మరో వైపు తిప్పుకొని ముప్పై సెకన్ల తర్వాత తీసేసుకోవాలి.
8.అంతే హెల్తీ ,టేస్టీ ప్రోటీన్ దోశలు రెడీ అయినట్టే.