Kitchenvantalu

Non stick cookware:నాన్ స్టిక్ పాత్రలను గీతలు పడకుండా ఇలా శుభ్రం చేయండి… !

Non stick cookware tips in telugu : ఈ మధ్యకాలంలో నాన్ స్టిక్ పాత్రల వాడకం చాలా ఎక్కువైంది. వంటకాలను ఈ నాన్ స్టిక్ పాత్రలలో చేసినప్పుడు రకరకాల మరకలు పడుతూ ఉంటాయి. వాటిని శుభ్రం చేయటం చాలా కష్టమైన పని. ఇప్పుడు చెప్పే చిట్కాల ద్వారా చాలా సులభంగా గీతలు పడకుండా శుభ్రం చేయవచ్చు.

నాన్ స్టిక్ పాత్రలను శుభ్రం చేసే సమయంలో బాగా రుద్దకూడదు. ఈ విధంగా రుద్దితే పై పూత దెబ్బతింటుంది. వీటిని గోరువెచ్చని నీటిలో నానబెట్టి డిష్ వాషింగ్ జెల్ మరియు మృదువైన స్పాంజీతో శుభ్రం చేయాలి. వీటిని శుభ్రపరిచేందుకు ధృఢంగా ఉండే పీచును, స్టీల్‌, ప్లాస్టిక్‌ వంటి రేపర్‌లను వాడకూడదు.

అలాగే ఎక్కువ ఘాటుగా ఉండే క్లీనింగ్‌ పౌడర్‌లను కూడా ఉపయోగించకూడదు. కొంత మంది బాగా మెరుపు రావటం కోసం ఎక్కువ సేపు రుద్దటం,తోమటం వంటివి చేస్తూ ఉంటారు. అలా అసలు చేయకూడదు. ఒక వేళ పాత్రకు ఏవైనా పదార్థాలు అతుక్కొని ఉంటే వాటిని చాకు, చెమ్చా వంటి వాటితో శుభ్రం చేయకూడదు. పాత్రలో నీటిని పోసి కొద్ది సమయం నాననివ్వాలి. తర్వాత మెల్లగా రుద్దికడిగితే అతుకున్న పదార్థం వదిలిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.