Kitchenvantalu

Chana Pulao Recipe: నోరు చప్పగా అనిపించినప్పుడు ఇలా చనా పలావు చేసుకోండి, రుచి అదిరిపోతుంది

Chana Pulao Recipe: నోరు చప్పగా అనిపించినప్పుడు ఇలా చనా పలావు చేసుకోండి, రుచి అదిరిపోతుంది..ఈ వంటకు అవసరమైన పదార్ధాలు, ఎలా తయారుచేయాలో చూద్దాం.

కావలసినవి:
బాస్మతి బియ్యం- 1 కప్పు (గంట నానబెట్టినది
నల్ల సెనగలు- 1/2 కప్పు(రాత్రంతా ననబెట్టినది)
ఉల్లిపాయ-1
పచ్చిమిర్చి చీలికలు- 4
పుదీనా తరుగు- 2 tbsps
కొత్తిమీర తరుగు- 2 tbsps
పెరుగు- 1/3 కప్ చిలికినది
అల్లం వెల్లూలి ముద్దా- 1 tbsp
నిమ్మరసం- 1 tsp
ఉప్పు
కారం- 1/2 tsp
గరం మసాలా పొడి- 1/2 tsp
పసుపు- 1/4 చెంచా
వేయించిన జీలకర్ర పొడి- 1/2 tsp
షాహీ జీర- 1/2 tsp
యాలకలు- 4
లవంగాలు- 4
దాల్చిన చెక్కా- ఇంచ్
బిరియానీ ఆకు- 1
అనాసపువ్వు- 1
నీళ్ళు- 1.1/2 కప్స్(బాస్మతి బియ్యానికి)
నీళ్ళు – 2.1/4 కప్స్ (సోనా మసూరి బియ్యానికి)

తయారీ విధానం:
కుక్క ర్లో నూనె నెయ్యి వేడి చేసి షాహీ జీరా, లవంగాలు, యాలకలు, బిరియానీ ఆకు, అనసపువ్వు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ చీలికలు వేసి మెత్తబడే దాక వేపి సెనగలు వేసి 3-4 నిమిషాలు వేపుకోవాలి.

ఆ తరువాత పచ్చిమిర్చి చీలికలు, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లూలి ముద్దా, చిలికిన పెరుగు వేసి, పెరుగు మసాలల్లో కలిసిపోయి నూనె పైకి తేలేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.

ఆ తరువాత నీళ్ళు పోసి, కొత్తిమీరా, పుదీనా తరుగు, నిమ్మరసం పిండి ఓ సారి కలిపి కుక్కర్ మూత పెట్టి హై-ఫ్లేం మీద 1 విసిల్ రానిచ్చి, 15-20 నిమిషాల తరువాత అడుగు నుండి అట్లకాడతో కలుపుకోవాలి అంతే. నచ్చితే 2-3 బొట్లు ఖేవ్డా వాటర్ లేదా రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు.

ఇదే సోనా మసూరి బియ్యానికి గంట పాటు నానబెట్టిన బియ్యానికి 2.1/4 కప్స్ నీళ్ళు పోసి హై ఫ్లేం మీద 2 విసిల్స్ రానివ్వాలి. 20 నిమిషాల తరువాత సర్వ్ చేసుకోవాలి.

టిప్స్:
శనగలు ఎంత నానితే అంత రుచి ఈ పులావ్ కి.